IndiGo pilot collapses : నాగపూర్ విమానాశ్రయంలో గుండెపోటుతో ఇండిగో పైలట్ మృతి

నాగ్‌పూర్ విమానాశ్రయం బోర్డింగ్ గేట్ వద్ద ఇండిగో పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. 6 ఈ 135 నంబరు గల నాగ్‌పూర్-పూణే ఇండిగో విమానాన్ని నడపాల్సిన పైలట్‌లలో ఒకరు నాగ్‌పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయి, ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు....

IndiGo pilot collapses : నాగపూర్ విమానాశ్రయంలో గుండెపోటుతో ఇండిగో పైలట్ మృతి

IndiGo

Updated On : August 18, 2023 / 7:38 AM IST

IndiGo pilot collapses : నాగ్‌పూర్ విమానాశ్రయం బోర్డింగ్ గేట్ వద్ద ఇండిగో పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. 6 ఈ 135 నంబరు గల నాగ్‌పూర్-పూణే ఇండిగో విమానాన్ని నడపాల్సిన పైలట్‌లలో ఒకరు నాగ్‌పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయి, ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. (IndiGo pilot collapses) పైలట్ తాను నడిపే విమానానికి ముందు విశ్రాంతి తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మార్గదర్శకాలు చెబుతున్నాయి.

Terrorist Yasin Malik’s Wife : పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్యకు మంత్రి పదవి

పైలట్ విశ్రాంతి తీసుకున్నా గుండెపోటుతో మృత్యువాత పడ్డాడని విమానాశ్రయ అధికారులు చెప్పారు. గుండెపోటుతోనే పైలట్ మరణించాడని కిమ్స్ కింగ్స్ వే ఆసుపత్రి వైద్యులు చెప్పారు. (boarding gate of Nagpur airport)

Earthquake : కొలంబియన్ రాజధానిలో భారీ భూకంపం

ఆసుపత్రి అత్యవసర బృందం అతనికి పైలట్ కు సీపీఆర్ చేసినా అతను స్పందించలేదని వైద్యులు చెప్పారు. 271 మందితో ఉన్న విమానం బాత్రూంలో పైలట్ మరణించడంతో కో-పైలట్‌లు అత్యవసర ల్యాండింగ్ చేశారు. పైలట్ మృతితో విమానం ఆలస్యంగా బయలుదేరింది.