Jobs : కొచ్చిన్ షిప్ యార్డులో ఉద్యోగాల భర్తీ

ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Jobs : కొచ్చిన్ షిప్ యార్డులో ఉద్యోగాల భర్తీ

Jobs

Jobs : భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనోటిఫికేషన్ ను అనుసరించి వివిధ విభాగాల్లో 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వాటిలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు 14 ఖాళీలను భర్తీ చేయనుండగా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నైపుణ్యాన్ని కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయస్సు 2021 డిసెంబరు 03 నాటికి 35 ఏళ్లు మించకూడదు. మొదటి ఏడాది నెలకు రూ.47,000, రెండో ఏడాది నెలకు రూ.48,000, మూడో ఏడాది నెలకు రూ.58,000 వేతనంగా చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు 56 ఖాళీలను భర్తీ చేయనుండగా, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నైపుణ్యాన్ని అభ్యర్ధులు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 2021 డిసెంబరు 03 నాటికి 30 ఏళ్లు మించకూడదు. మొదటి ఏడాది నెలకు రూ.37,000, రెండో ఏడాది నెలకు రూ.38,000, మూడో ఏడాది నెలకు రూ.40,000 వేతనంగా చెల్లిస్తారు.

ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 03గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/