Makara Jyothi : శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.

Makara Jyothi : శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం

Makara Jyothi

Makara Jyothi : ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఈ సాయంత్రం పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో శబరిగిరులు మార్మోగాయి.

జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివచ్చారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మకర జ్యోతిని వీక్షించిన అయ్యప్పలు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. కరోనా నేపథ్యంలో ఆలయ కమిటీ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించింది.

Heart Diseases Risk : గుండె జబ్బులు ఇందుకే వస్తున్నాయట.. షాకింగ్ వాస్తవాలు..!

మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తుల విశ్వాసం. సాయంత్రం 6.51 గంటల సమయంలో మకర జ్యోతి దర్శనం ఇచ్చిందని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది.

Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

ప్రతి ఏటా సంక్రాంతి నాడు మకరజ్యోతి దర్శనం ఆనవాయితీగా వస్తోంది. దీన్నే మకరవిళక్కు అని పిలుస్తారు. జ్యోతి కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చి అదృశ్యమవుతుందని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు చెబుతుంటారు. కాగా, ఈ నెల 20న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మూసివేయనున్నారు.