షాకయ్యారా : హార్స్ రైడింగ్ మ్యాజిక్ ట్రిక్ చూశారా?

షాకయ్యారా : హార్స్ రైడింగ్ మ్యాజిక్ ట్రిక్ చూశారా?

ఇంటర్నెట్ లో వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం.. క్షణాల్లో వైరల్ కావడం కామన్ అయిపోయింది. ఫన్నీ వీడియోలు క్రియేట్ చేసే యాప్ లు వచ్చాక ప్రతిఒక్కరూ వీడియోలు తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ లో వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం.. క్షణాల్లో వైరల్ కావడం కామన్ అయిపోయింది. ఫన్నీ వీడియోలు క్రియేట్ చేసే యాప్ లు వచ్చాక ప్రతిఒక్కరూ వీడియోలు తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చైనా కంపెనీకి చెందిన టిక్ టాక్ యాప్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఈ టిక్ టాక్ యాప్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. ఆడియోకు తగినట్టుగా తమ హవాభావాలను పలికిస్తూ వీడియోలు క్రియేట్ చేసి షేర్ చేసేస్తున్నారు.

టిక్ టాక్ యాప్ వాడుతున్న మిలియన్ల మంది యూజర్లు ఫన్నీ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి టిక్ టాక్ వీడియోలో తన మ్యాజిక్ ట్రిక్ తో అందరి దృష్టిని ఆకర్షించేందుకు యత్నించి ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడో తెలియక వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీగా ఓ కామెంట్ పెట్టారు.. దయచేసి ఇండియన్స్ ను ఇంటర్నెట్ కు దూరంగా తీసుకెళ్లండి అంటూ ఫన్నీ కాప్షన్ పెట్టారు. 

మీరు నమ్మడం లేదా.. అయితే ఈ వీడియో మీరే చూడండి.. టిక్ టాక్ వీడియోలోని వ్యక్తి గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది కదా. ఎరుపు రంగు క్లాత్ వేసిన కర్రతో స్టూల్ పై నిలబడి గుర్రంపై స్వారీ చేస్తున్నట్టుగా కనిపించాడు. పక్కనే ఓ మహిళ నిల్చొని చూస్తోంది. ఎప్పుడు అయితే ఆ మహిళ రెడ్ క్లాత్ ను తీస్తే కానీ తెలియలేదు.. అతడు స్టూల్ పై నిలబడిన విషయం.. పైగా అలిసిపోయినట్టు అతని ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూసి నెటిజన్లంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. వీడియోను షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియోకు ట్విట్టర్ లో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. 4,257 సార్లు ఈ వీడియోను రీట్వీట్లు చేశారు. 

      ×