మోడీ రైతు బంధు : కోటిమంది ఖాతాల్లోకి రూ.2వేలు

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 08:12 AM IST
మోడీ రైతు బంధు : కోటిమంది ఖాతాల్లోకి రూ.2వేలు

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం(ఫిబ్రవరి-24-2019) ఈ స్కీమ్‌ను స్టార్ట్ చేశారు. 5 ఎకరాల లోపు భూమి, ఒక కుటుంబంలో ఒక పాస్‌బుక్‌ ఉన్న రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. తొలి విడతగా యూపీ, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు జమ కానున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మరో కోటి మంది రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమ కానుంది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6వేలు ఇవ్వనుండగా, మిగిలిన రూ.4వేలు ఇంకో రెండు విడతల్లో జమ చేస్తారు. ఈ పథకం కోసం రూ.75వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తొలి విడతలో వ్యవసాయ పెట్టుబడి సాయం పొందడానికి 17 లక్షలమంది రైతులు అర్హత సాధించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అధికారులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలను పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మొదటి వాయిదా పొందేందుకు రైతులు ఆధార్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత వాయిదాలు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అని కేంద్రం కండీషన్ పెట్టింది.