కోతికి జీవిత ఖైదు..!!ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  • Published By: nagamani ,Published On : June 16, 2020 / 10:16 AM IST
కోతికి జీవిత ఖైదు..!!ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఘోరమైన నేరాలు చేసినవారికి జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. కానీ అధికారులు  ఓ కోతికి జీవిత ఖైదు శిక్ష వేశారు. ఇక జీవితాంతం అది బోనులోనే ఉండితీరాలంటున్నారు ఉత్తరప్రదేశ్‌ అధికారులు.  ఆరు సంవత్సరాల క్రితం ఆ కోతి చేసిన పనికి అధికారులు ఈ శిక్ష విధించారు.ఇంతకీ అది చేసిన  అంత ఘోర నేరమేంటి అనుకుంటున్నారా??

అది తెలుసుకోవాలంటే ఆరు సంవత్సరాలక్రితంజరిగిన ఘటనలు తెలుసుకోవాల్సిందే.ప్రస్తుతం బోనులో బందీగా ఉన్న ఆ కోతి మిర్జాపూర్ జిల్లాలో పుట్టింది. దాన్ని ఓ వ్యక్తి పెంచుకునే వాడు. తను ఎక్కడికి వెళినా దాన్ని కూడా తీసుకుపోయేవాడు. ఆఖరిని మద్యం తాగటానికి వెళ్లినా సరే కోతిని తీసుకెళ్లేవాడు. అలా తన యజమాని మద్యం తాగటం చూస్తూ ఉండేది. దాంతో అతను కోతికి కూడా మద్యం తాగటం అలవాటు చేశాడు. ఇద్దరూ కలిసి చక్కగా మందు కొట్టేవారు. 

మద్యానికి బానిసైన ఆ కోతి కూడా అతనితో పాటు గ్లాసులు గ్లాసులు తాగేసేది. కొంత కాలానికి ఆ వ్యక్తి చనిపోయాడు. దీంతో దాన్ని చూసుకునే వారు లేరు..మందుపోసేవారు లేక అది పిచ్చెక్కినట్టుగా ప్రవర్తించేది.  ఆ కోపంతో ఎవరు కనిపిస్తే వాళ్లపై దూకి దాడి చేసేది. ముఖ్యంగా మద్యం షాపుల దగ్గరకెళ్లి రచ్చ రచ్చ చేసేది. మందు తాగేవాళ్లుకనిపిస్తే చాలా దాడి చేసి సీసాలు లాగేసుకుని గటగటా తాగేసేది. అలా మందు దొరక్కపోతే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తూ ఎవరు కనిపిస్తేవాళ్లపై దాడి చేసేది. 
దీంతో స్థానికులు అది ఏ మూల నుంచి వచ్చి మీద పడి దాడి చేస్తుందోనని భయపడిపోయోవారు. అదా ఆ కోతి  250 మందిని కరిచింది. దాంతో వేగలేక స్థానికులు అటవీ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. దాంతో అటవీశాఖ అధికారులు దాన్ని బోను సాయంతో బంధించి జూ పార్కుకు తరలించారు. 

ఆ తరువాత జూలో ఉన్న కోతులతో దాన్ని కలపటానికి జూ అధికారులు చేయని ప్రయత్నమంటూ లేదు.  కానీ అది ఏ కోతులతోను కలిసేది కాదు. అక్కడ ఉండే కోతులు దీంతో కలవటానికి వస్తే వాటిపై కూడా దాడి చేసేది. అలా మద్యానికి బానిసైన కోతితో జూ అధికారులు పడరాని పాట్లు పడ్డారు. ఇక దీంతో వేగలేమని అనుకున్నవాళ్లు దీంతో మూడేళ్లుగా దాన్ని బోనులోనే బంధించారు. అయినా కూడా దాని తీరులో మార్పురాకపోవడంతో ఇక జీవితాంతం బోనులోనే ఉంచాలని నిర్ణయించారు. అలా ఆ కోతికి జీవిత ఖైది విధించారు జూ అధికారులు.దాని తీరులో మార్పు రాకపోవం వల్లే ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.