తింటున్నాడు..తాగుతున్నాడు గానీ 18 నెలలుగా టాయిలెట్‌కు వెళ్లట్లేదు..! ఇదేం రోగంరా నాయనా..!!

  • Published By: nagamani ,Published On : November 23, 2020 / 12:47 PM IST
తింటున్నాడు..తాగుతున్నాడు గానీ 18 నెలలుగా టాయిలెట్‌కు వెళ్లట్లేదు..! ఇదేం రోగంరా నాయనా..!!

MP boy did not go to the toilet for 18 months : మనిషి అయినా జంతువైనా..పక్షులైనా సరే ఆహారం తినటం..నీరు తాగటం..అనంతం మలమూత్ర విసర్జన అనేది సర్వసాధారణం. కానీ  ఎంత తిన్నా..ఏం తాగినా గానీ..మలమూత్ర విసర్జన జరటంలేదు అంటేఅది కచ్చితంగా ఓ వింత వ్యాధి అనే అనుకోవాలి.



అటువంటి అరుదైన వింత వ్యాధితో బాధపడుతున్నాడు మధ్యప్రదేశ్ లోని మురౌనా జిల్లాలో చెందిన 16 ఏళ్ల అబ్బాయి. అతని పేరు ఆశీష్. ఆశీష్ ప్రతీరోజు అందరిలాగానే ఆహారం తింటున్నాడు నీళ్లు కడా తాగుతున్నాడు..కానీ టాయ్ లెట్ కుమాత్రం వెళ్లట్లేదు. గత 18 నెలల నుంచి మతమూత్ర విసర్జన చేయట్లేదు. ఈ సమస్యతో బాధపడుతున్నాడని అతని తల్లిదండ్రులు రోజుకు 20 రొట్టెలు తినిపిస్తున్నారు. లీటర్ల కొద్దీ నీళ్లు తాగిస్తున్నారు. కానీ ఫలితం లేదు. టాయ్ లెట్ కు వెళ్లట్లేదు…!!



ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే 18 నెలల నుంచి టాయ్ లెట్ కు వెళ్లకపోయినా ఆశీష్ కు ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురవ్వట్లేదు. దీంతో ఆశీష్ మనోజ్ చాందిల్ కొడుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. కానీ ఫలితం లేదు. అలా చాలామంది డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లాడు. ఎంతో మంది డాక్టర్లు ఎన్నో మందులు రాసిచ్చారు. ఆ మెడిసిన్స్ అన్నీ వాడాడు. కానీ ఏమాత్రం ఫలితం లేదు. దీంతో ఆశీష్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఆశీష్ కు ఎటువంటి సమస్య లకు దారి తీస్తుందోనని భయపడుతున్నారు.


ఆశీష్ తల్లిదండ్రుల పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క అతన్ని పలు రకాలుగా పరీక్షించిన డాక్టర్లు సీనియర్ డాక్టర్లు సైతం తెగ ఆశ్చర్యపోతున్నారు. అతనుతిన్న ఆహారపు వ్యర్థాలు ఏమవుతున్నాయని పలు పరీక్షలు చేశారు. స్కానింగ్ లు చేశారు. కానీ వారికేమీ తెలియలేదు. అతనిలో ఎటువంటి అనారోగ్యం సమస్యలు కనిపించలేదు. దీంతో ఆ వింత వ్యాధి ఏమిటో తెలుసుకోలేక సీనియర్ డాక్టర్లు సైతం తలలు పట్టుకుంటున్నారు.


కాగా ఆశీష్ రోజుకు 18 నుంచి 20 రొట్టెలు తింటుంటాడు. మలమూత్ర విసర్జన జరగకపోయినప్పటికీ అతనికి ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురుకాలేదు. కనీసం కడుపు నొప్పికూడా రావట్లేదట..తమ కొడుకు సమస్య పరిష్కరించే డాక్టర్ల కోసం తల్లిదండ్రులు ఆశీష్‌ను డాక్టర్లు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు…!!