‘వీపు మీద కత్తిపోటుతో పోలీస్ స్టేషన్‌కు వచ్చినా.. ఫార్మాలిటీస్ పూర్తయ్యేంతవరకూ పట్టించుకోరా?’

‘వీపు మీద కత్తిపోటుతో పోలీస్ స్టేషన్‌కు వచ్చినా.. ఫార్మాలిటీస్ పూర్తయ్యేంతవరకూ పట్టించుకోరా?’

వీపు మీద కత్తిపోటుతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చేశాడో వ్యక్తి. Madhya Pradesh పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించిన ఫొటో వైరల్ అయింది. అలా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పటికీ పోలీసులు లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని యాక్షన్ తీసుకోవడానికి బయల్దేరారు.

జబల్‌పూర్‌కు చెందిన వ్యక్తి గార్హా పోలీస్ స్టేషన్‌కు వీపు మీద కత్తిపోటుతో వచ్చాడు. సాధారణంగా ఆ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా హాస్పిటల్ కు వెళ్తారు కానీ, అతను పోలీస్ స్టేషన్ కు ఎందుకొచ్చాడు. లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యేంత వరకూ నిలబడే ఉన్నాడు.ఈ ఘటన వైరల్ అవడంతో పోలీసుల పనితీరుపై సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. గాయం నుంచి రక్తం కారుతున్నా.. వీపు మీద కత్తిపోటుతో అలానే నిల్చోవాల్సిందేనా? అని ప్రశ్నిస్తున్నారు.

అతనికి గాయం జరిగిందని తెలియగానే ఇరుగుపొరుగు వారు, కుటుంబ సభ్యులు అంతా కలిసి స్పాట్ నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఎట్టకేలకు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.