Mukesh Ambani: ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరింపులు.. భద్రత పెంపు

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ తాజాగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరింపులు.. భద్రత పెంపు

Mukesh Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి అయిన ముంబైలోని హర్స్‌కిసన్‌దాస్ ఆస్పత్రికి సోమవారం ఎనిమిది బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

కేసు నమోదు చేసుకున్న డీబీ మార్గ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. ఫోన్ కాల్ చేసి బెదిరించిన నిందితుడు తాను నెంబర్ వన్ టెర్రరిస్ట్ అని, ఎన్ఐఏ, ఏటీఎస్, ముంబై పోలీసులపై దుర్భాషలాడాడు. ప్రస్తుతం పోలీసులు.. ఫోన్ చేసి బెదిరించిన ఆగంతకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ బెదిరింపుల నేపథ్యంలో ముఖేష్ నివాసమైన ఆంటిలియా భవనం వద్ద పోలీసులు భద్రత పెంచారు. భవనం బయట, చుట్టుపక్కల మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. అయితే, ముఖేష్ అంబానీకి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు.

BJP-TRS: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ-టీఆర్ఎస్ ఘర్షణ

గతంలో కూడా ఆయన కుటుంబాన్ని చంపుతామంటూ హెచ్చరికలు వచ్చాయి. గత సంవత్సరం ముఖేష్ నివాసం దగ్గర ఒక స్కార్పియో వాహనంలో 20 వరకు జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా, ముఖేష్ అంబానీ కోసమే వీటిని అక్కడ ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు.