BJP-TRS: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ-టీఆర్ఎస్ ఘర్షణ

జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. దేవరుప్పల వద్ద బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

BJP-TRS: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ-టీఆర్ఎస్ ఘర్షణ

BJP-TRS: జనగామ జిల్లాలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో టీఆర్ఎస్-బీజేపీ మధ్య గొడవ జరిగింది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగామ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఆయన దేవరుప్పల చేరుకోగానే, టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఈ క్రమంలో ఇరుపార్టీలూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని, పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తతోపాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారు. అక్కడికి చేరుకుని ఇరుపక్షాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. లాఠీఛార్జి చేసి కార్యకర్తల్ని చెదరగొట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నేతల తలలు పగులగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. ఆరు ఖండాల్లో ఎగిరిన భారత జెండా

పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబులోంచి రావడం లేదన్నారు. మరోవైపు తనకు పోలీసులు భద్రత కల్పించడాన్ని బండి సంజయ్ నిరాకరించారు. తనకు భద్రత అవసరం లేదని, కార్యకర్తలే తన భద్రత చూసుకుంటారన్నారు. కాగా, బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పాదయాత్రను అడ్డుకోవద్దని టీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఊరూరా తిరిగి బండి సంజయ్ తెలుసుకోవాలని చెప్పారు. ఈ ఘటన తర్వాత ప్రస్తుతం దేవరుప్పలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.