Anesthesia Overdose: మోతాదుకు మించి మత్తు మందు తీసుకున్న డాక్టర్ మృతి

Anesthesia Overdose: మోతాదుకు మించి మత్తు మందు తీసుకున్న డాక్టర్ మృతి

Kem Hospital

Anesthesia Overdose: 29ఏళ్ల ఎంబీబీఎస్ డాక్టర్.. మోతాదుకు మించి మత్తుమందు తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని కింగ్ ఎడ్వర్ట్ మెమొరియల్ లో ఎండీ చేస్తున్న ఆమె.. ఒత్తిడి కారణంగా చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. నటాషా బెంగాలీ అనే డాక్టర్ వోర్లీలో నివాసముంటుందని విద్య పట్ల ఒత్తిడిలే ఆమె ప్రాణం కోల్పోవడానికి కారణమని చెప్తున్నారు.

కేఈఎమ్ హాస్పిటల్ నుంచి నటాషా ఎంబీ చదువుతున్నారు. ప్రస్తుతం మూడో సంవత్సరం కోర్సులో ఉన్నారు. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు ఇంటికి తిరిగెళ్లిన ఆమె రూంలోనే ఉండిపోయారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఆమె తల్లి సాయంత్రం ఇంటికి వచ్చి కూతురి గురించి చూసేసరికి రూంలో ఉన్నట్లు తెలిసింది.

ఎంత పిలిచినా పలకకపోవడంతో దగ్గరకు వెళ్లి చూసేసరికి స్పృహ లేకుండా పడి ఉంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నాడని కాకపోతే లివింగ్ రూంలో ఉన్నట్లు తెలుస్తుంది.

హాస్పిటల్ అధికారులు పోలీసులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత పోస్టు మార్టం కోసం డెడ్ బాడీని తరలించారు. ఆమె ఎడమచేతిపై ఇంజెక్షన్ ఇచ్చినట్లు వైద్యులు గుర్తించారు.

కొద్ది నెలలుగా ఆ డాక్టర్ ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. తన మూడో సంవత్సరం పరీక్షల గురించి ఆలోచిస్తూ ఉండేది. ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. కుటుంబంలో తల్లి, అన్న, అత్త అందరూ డాక్టర్లే కాగా మృతురాలి తండ్రి మాత్రం ఇంజినీర్.

ప్రాథమిక విచారణలో అనిస్తీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడంతోనే చనిపోయినట్లుగా గుర్తించాం. యాక్సిడెంటల్ డెత్ గా కేసు బుక్ చేసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని ఓర్లీ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కోలీ అన్నారు.