Amazon: అమెజాన్‌లో రూ.396ల మౌత్ వాష్ కొంటే రూ.13వేల ఫోన్ వచ్చింది

అమెజాన్ లో ఆర్డర్ పెట్టిన వ్యక్తికి లక్కీ ఛాన్స్ తగిలింది. రూ.396లతో మౌత్ వాష్ ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తికి Redmi Note 10 వచ్చింది. భళేగా వచ్చిందని సీక్రెట్ గా...

Amazon: అమెజాన్‌లో రూ.396ల మౌత్ వాష్ కొంటే రూ.13వేల ఫోన్ వచ్చింది

Redme Note 10

Amazon: అమెజాన్ లో ఆర్డర్ పెట్టిన వ్యక్తికి లక్కీ ఛాన్స్ తగిలింది. రూ.396లతో మౌత్ వాష్ ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తికి Redmi Note 10 వచ్చింది. భళేగా వచ్చిందని సీక్రెట్ గా దాచిపెట్టుకోకుండా ట్విట్టర్లో అమెజాన్ అనే ట్యాగ్ తో పోస్టు చేశాడు.

వారం ముందు చేసిన మౌత్ వాష్ ఆర్డర్ కు రెడ్ మీ10 వచ్చిందని.. అద్భుతమైన మీమ్స్, రియాక్షన్స్, పంచ్ లైన్లతో ఆ పోస్టును వైరల్ గా మార్చేస్తున్నారు. లోకేశ్ దాగా అనే వ్యక్తి అమెజాన్ ఇండియాను ట్యాగ్ చేస్తూ స్క్రీన్ షాట్ తో సహా ఒరిజినల్ ఆర్డర్ ను పోస్టు చేశాడు.

కోల్గేట్ 4 మౌత్ వాష్ బాటిల్స్ రూ.396కు ఆర్డర్ పెట్టాడు. దానికి బదులుగా రూ.13వేల విలువైన మొబైల్ ఫోన్ వచ్చింది.

‘హలో అమెజాన్. కోల్గేట్ మౌత్ వాష్ ఆర్డర్ చేశాను. దానికి బదులుగా రెడ్ మీఇండియా నోట్ 10 డెలివరీ అయింది. మౌత్ వాష్ అనేది తిరిగి ఇవ్వడానికి కుదరని ప్రొడక్ట్ అని మీరు చెప్పినట్లుగా ఈ ప్రొడక్ట్ కూడా యాప్ లో రిటర్న్ చేయడం కుదరదని పోస్టు చేశాడు.

ప్యాకేజి ఓపెన్ చేయడానికి ముందు చూస్తే ప్యాకేజింగ్ లేబుల్ నా పేరు మీదే ఉంది కానీ, ఇన్వాయీస్ వేరే వాళ్లపేరు మీదుంది. రైట్ పర్సన్ కు పంపించమని ఈమెయిల్ కూడా చేశానని అందులో చెప్పాడు.