Goregaon-Mulund link road: ముంబై ప్రజలకు ట్రాఫిక్ నుంచి ఊరట.. ₹6,322 కోట్లతో రెండు భారీ టన్నెల్స్
4.7 కిలోమీటర్ల దూరం వరకు రెండు భారీ టన్నెల్స్ నిర్మించనున్నారు. కారణం.. ఈ రెండు ప్రాంతాల మధ్య సంజయ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ ఉండడం. పార్క్ సహజత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా 13 మీటర్ల అడుగులో ఈ టన్నెల్స్ వేయనున్నారు. కాగా, ఈ రెండు టన్నెల్స్ నిర్మాణానికి 6,322 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు బీఎంసీ ప్రతిపాదించింది.

Mumbai to get Rs 6322 crore twin tunnels for east-west connectivity
Goregaon-Mulund link road: ముంబై ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని రోడ్లు నిర్మించి, ఎన్ని వంతెనలు వేసినా మళ్లీ మళ్లీ ట్రాఫిక్ పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు ముంబై, పశ్చిమ ముంబై మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ బాధల్ని కూడా తప్పించేందుకు ఒక రహదారి నిర్మించాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంకల్పించింది. ఇందులో భాగంగా గోరేగావ్‌లోని వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి ముల్లుండ్లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వరకు 12 కిలోమీటర్ల మేర లింకు రోడ్డు నిర్మిస్తున్నారు.
ఇందులో భాగంగా 4.7 కిలోమీటర్ల దూరం వరకు రెండు భారీ టన్నెల్స్ నిర్మించనున్నారు. కారణం.. ఈ రెండు ప్రాంతాల మధ్య సంజయ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ ఉండడం. పార్క్ సహజత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా 13 మీటర్ల అడుగులో ఈ టన్నెల్స్ వేయనున్నారు. కాగా, ఈ రెండు టన్నెల్స్ నిర్మాణానికి 6,322 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు బీఎంసీ ప్రతిపాదించింది. 2023 మేలో మొదలు కానున్న ఈ పనులు 2026 అందుబాటులోకి వచ్చేలా పనులు పూర్తి చేస్తామని బీఎంసీ పేర్కొంది.
మొత్తం మూడు దశల్లో ఈ లింకు రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి. ఎలివేటెడ్ కారిడార్, టన్నెల్స్, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఈ లింకు రోడ్డులో ఉన్నాయి. ఈ లింకు రోడ్డు నిర్మాణానికి పూర్తి అంచనా వ్యయం 8,000 కోట్ల రూపాయలు అవుతుందని బీఎంసీ అంచనా వేస్తోంది. వాస్తవానికి ఇది గతంలో 4,700 కోట్ల రూపాయలు గానే ప్రతిపాదించినప్పటికీ.. గడుస్తున్న కాలానికి అనుగుణంగా అంచనా వ్యయం పెరిగిందట.
Pak PM Sharif: పాక్ డేంజరెస్ కంట్రీ అన్న బైడెన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి