Idgah Maidan: ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు వద్దు.. సుప్రీంకోర్టు తీర్పు

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈద్గా మైదానంలో మండపం ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, రేపు ఉదయమే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఈ విషయమై అత్యవసర విచారణ చేపట్టిన ముగ్గురు సభ్యుల నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం.. ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి నిర్వహించరాదని తీర్పు వెలువరించింది.

Idgah Maidan: ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు వద్దు.. సుప్రీంకోర్టు తీర్పు

No Ganesh Chaturthi celebrations at Idgah Maidan as SC orders

Idgah Maidan: బెంగళూరులోని ఈద్గా మైదానంలో గణేషుడి ఉత్సవాలు నిర్వహించవద్దని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంతే కాకుండా మైదానం వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈద్గా మైదానంలో మండపం ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, రేపు ఉదయమే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఈ విషయమై అత్యవసర విచారణ చేపట్టిన ముగ్గురు సభ్యుల నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం.. ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి నిర్వహించరాదని తీర్పు వెలువరించింది.

ఈద్గా మైదానంలో వినాయకుడి విగ్రహాలు పెట్టడానికి తొలుత ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో వారికి చుక్కెదురైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు
సమర్ధించింది. ఉత్సవ నిర్వహణపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంతో బెంగళూరులోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి
వేడుకలను నిర్వహించేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించడంతో కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Taj Mahal: వివాదంలో తాజ్ మహల్.. కృష్ణుడి విగ్రహంతో ఉన్న పర్యాటకుడికి నో ఎంట్రీ.. హిందూ సంఘాల ఆగ్రహం