హార్ట్ టచ్చింగ్ వీడియో : మేకతో ఖడ్గమృగం ఆటలు

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 09:49 AM IST
హార్ట్ టచ్చింగ్ వీడియో : మేకతో ఖడ్గమృగం ఆటలు

స్నేహం..బహుశా మనుషులకు జంతువుల నుంచి..పక్షుల నుంచే వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనిషి ఒకప్పుడు జంతువులానే బతికాడు. జంతువులను చూస్తు వాటితో కలిసి జీవించాడు. అనాది కాలంలోనే కాదు ఇప్పటికీ మనిషి జంతువులను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆస్తుల కోసం మనిషిని మనిషే చంపేసుకుంటున్న ఈరోజుల్లో మనుషులకంటే జంతువులే నయం..క్రూరమృగాల నయం అనిపిస్తున్నాయి. అటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జాతి వైరాన్ని మరచి జంతువు స్నేహం చేస్తున్నాయి. జాతి వైరాలని విడిచి ఒక జంతువుకు పుట్టిన వాటిని మరోజాతి జంతువులు సాకుతున్నాయి. ప్రాణానికి సమానంగా కాపాడుతున్నాయి.పెంచుతున్నాయి. కలిసి మెలిసి జీవిస్తున్నాయి. అటువంటిదే ఈ హార్ట్ టచ్చింగ్ వీడియో. 

అటువంటిదే ఈ హార్ట్ టచ్చింగ్ వీడియో. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్, సుశాంతా నందా తన ట్విట్టర్‌లో మరో హార్ట్ టచ్చింగ్ వీడియోను  పోస్ట్ చేశారు. ‘‘ తల్లులు దగ్గర లేకుండా పెరిగే అనాథ ఖడ్గమృగాలు చాలా డల్ గా ఉంటాయి. వాటిని ఉత్సాహ పరచటానికి మేకలుగానీ..గొర్రెలు వంటి సాధు జంతువలతో వాటిని ఒత్తిడిని తగ్గించేలా చేస్తామని తెలిపారు. అలా ఓ ఖడ్గ మృగం పిల్లకు ఓ మేకతో స్నేహం కలిపారు అటవీ అధికారులు. వారి ప్రయత్నం ఫలించింది. రెండూ స్నేహితులై చక్కగా ఆడుకుంటున్నాయి. 

ఓ ఖడ్గమృగం మేకతో కలిసి మెలిసి ఆడుకుంటోంది. ఖడ్గ మృగం భారీగా ఉంటుంది. మేక చిన్నగా ముద్దుగా ఉంటుంది. ఈ రెండింటి స్నేహం..వాటి ఆట చూస్తే మనలో ఉండే ఒత్తిడి ఎగిరిపోతుంది. ఖడ్గ మృగం చుట్టూ మేక లేడి పిల్లలా గెంతులేస్తూ తిరిగింది. అది చూసి అప్పటి వరకూ డల్ గా ఉన్న  ఖడ్గ మృగం దాని భారీ శరీరంతో చక్కగా గెంతులేసింది. ఇది చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది.