Passenger Train : భారీగా పెరిగిన ప్యాసింజర్ రైలు చార్జీలు

16 నెలల తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడిపేవారు. ఇకపై 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడపనున్నారు. ఇక రైలు వేగంతోపాటు చార్జీలు కూడా పెంచింది రైల్వే శాఖ.. 30 నుంచి 40 శాతం మధ్య చార్జీలు పెరిగాయి.

Passenger Train : భారీగా పెరిగిన ప్యాసింజర్ రైలు చార్జీలు

Passenger Train

Passenger Train : కరోనా కారణంగా సుమారు 16 నెలలు నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు సోమవారం పట్టాలెక్కాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా గతేడాది మార్చి 22 నుంచి ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసింది రైల్వేశాఖ. ఇక కొన్నాళ్ళకు ఎస్స్ ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించింది. కానీ ప్యాసింజర్ రైళ్లను మాత్రం నడిపేందుకు సుముఖత చూపలేదు రైల్వేశాఖ. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఇక సోమవారం నుంచి 82 రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే ప్యాసింజర్ రైళ్ల వేగం పెంచింది.. దీంతోపాటు ఛార్జీలను కూడా పెంచింది. ప్యాసింజర్ రైలు చార్జీలను 30 నుంచి 40 శాతం వరకు పెంచినట్లు తెలుస్తుంది. ఈ రైళ్లు సోమవారం నుంచి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. రైళ్లవేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన రూట్లలో పట్టాల సామర్థ్యాన్ని పెంచింది.

ఇప్పటివరకు రిజర్వేషన్‌ టికెట్ల తరహాలోనే జనరల్‌ సీట్లకు సైతం ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకోవలసి వచ్చింది. ఇకపై అన్ని రైల్వేస్టేషన్లలో కౌం టర్ల ద్వారా ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని ప్రయాణం చేయవచ్చు.