Ram Charan : బాలీవుడ్ పార్టీలో పెద్ది హవా.. ధోని, సల్మాన్‌తో చరణ్.. ఫోటో వైరల్..
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan ) సైతం సల్మాన్ బర్త్ డే పార్టీకి హాజరు అయ్యారు.
A LEGENDARY PICTURE MS Dhoni Ram Charan Salman Khan and Bobby Deol during the birthday party.
Ram Charan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ శనివారం 60వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పన్వేల్ ఫామ్‌హౌస్ లో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ పార్టీలో టీమ్ఇండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన భార్య సాక్షి లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, జెనీలియా దేశ్‌ముఖ్, హుమా ఖురేషి, సింగర్ మికా సింగ్, సంగీతా బిజ్లా, రణదీప్ హుడా, టబు లతో పాటు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.
BCCI : టెస్టుల్లో గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. స్పందించిన బీసీసీఐ..

ఇక టాలీవుడ్ నుంచి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan ) సైతం సల్మాన్ బర్త్ డే పార్టీకి హాజరు అయ్యారు. మెగా కుటుంబంతో సల్మాన్‌కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన నటుల్లో చిరంజీవి ఒకరు అని పలు సందర్భాల్లో సల్మాన్ వెల్లడించారు. ఇక చిరు కోసమే ఆయన హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీలో స్పెషల్ రోల్ చేసినట్లు సల్మాన్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక బర్త్‌డే పార్టీలో పాటు సల్మాన్, రామ్‌చరణ్, ధోని లు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో బాబీ డియోల్ సైతం ఉన్నారు.
