BCCI : టెస్టుల్లో గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. స్పందించిన బీసీసీఐ..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ను (BCCI ) బీసీసీఐ సంప్రదించిందని పలు నివేదికలు వచ్చాయి
BCCI Gives Clarity on VVS Laxman To Replace Gautam Gambhir
BCCI : టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేయనున్నారంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. టెస్టుల్లో గంభీర్ కోచింగ్ సరిగా లేదని, అందుకనే భారత జట్టు పరాజయాలు చవిచూస్తోందని, ఈ క్రమంలోనే బీసీసీఐ సుధీర్ఘ ఫార్మాట్‌లో కొత్త కోచ్ కోసం అన్వేషిస్తోందనేది
సదరు వార్తల సారాంశం.
ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ సంప్రదించిందని పలు నివేదికలు వచ్చాయి. తాజాగా వీటి అన్నింటిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆ వార్తలు అన్నీ అవాస్తవాలని అన్నారు. లక్ష్మణ్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు.
ILT20 : పొలార్డ్ ఊచకోత.. ప్లే ఆఫ్స్‌కు ముంబై ..
‘గంభీర్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేస్తారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ రూమర్లే. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు. గంభీర్ కాంట్రాక్టు ప్రకారమే కొనసాగుతాడు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు కూడా ఇలాంటివి వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇలా చేయడం తగదు. ప్రజలు తమకు తోచిన విధంగా ఆలోచిస్తుంటారు. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఎవరో కల్పించిన ఊహాజనితమైన వార్త. ఇంకా చెప్పేందుకు ఏమీ లేదు.’ అని ఏఎన్ఐతో దేవజిత్ సైకియా తెలిపారు.
గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియాకప్ 2025 విజేతగా నిలిచింది. అయితే.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాజయాలను చవిచూసింది. అతడి మార్గనిర్దేశంలో ఏడు టెస్టుల్లో మాత్రమే భారత్ గెలిచింది. మరో 10 టెస్టుల్లో ఓడిపోయింది. రెండింటిని డ్రా చేసుకుంది.
ఇక ఇటీవల స్వదేశంలో దక్షిణాప్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే టెస్టుల్లో గంభీర్‌ను తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు ఎక్కువ అయ్యాయి. తాజాగా వీటిని బీసీసీఐ స్పందించింది.
