Video: జీవితంలో సంపాదించిన తొలి ఆదాయం.. 52 ఏళ్ల వయసులో.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే..

“ఇది నా జీవితంలో వచ్చిన తొలి ఆదాయం. యూట్యూబ్ ద్వారా సంపాదించాను. నాకు 52 ఏళ్లు. 6 నెలల్లోనే ఇది సాధించాను. నేను చాలా కష్టపడే వ్యక్తిని” అని ఆమె చెప్పింది.

Video: జీవితంలో సంపాదించిన తొలి ఆదాయం.. 52 ఏళ్ల వయసులో.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే..

Updated On : December 27, 2025 / 10:42 PM IST

Video: యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌ ఛానెల్‌ను కొందరు ఆలస్యంగా ప్రారంభించినా సక్సెస్‌ అవుతున్నారు.

జీవితంలో తొలిసారి చేతికి అందిన జీతం/సంపాదన అంటే అందరికీ ప్రత్యేకమే. ముఖ్యంగా మహిళలు చాలా మంది ఉద్యోగాలు చేయాలనుకుంటారు. కొన్ని పరిస్థితుల వల్ల ఇంటి పనులకు మాత్రమే పరిమితమవుతుంటారు. అటువంటి వారికి కూడా నడి వయసులోనూ సంపాదించే అవకాశం యూట్యూబ్‌ ద్వారా లభిస్తోంది. 52 ఏళ్ల వయసులో యూట్యూబ్ ద్వారా వచ్చిన తొలి ఆదాయాన్ని గర్వంగా చూపించిన ఓ మహిళ వీడియో వైరల్ అవుతోంది.

Also Read: నూతన సర్పంచ్‌లకు దివిటీలుగా.. పల్లె ప్రగతికి దిక్సూచిగా 10TV గ్రామస్వరాజ్యం.. ఆదివారం ఉదయం 10 గంటలకు

ఆ మహిళ కూతురు అన్షుల్ పరీక్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. తల్లికి తొలి సంపాదన అందడంతో ఆమె ఉన్న కూతురు, యూట్యూబ్ ద్వారా సంపాదించిన ఆదాయాన్ని గర్వంగా చూపిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ దృశ్యం సోషల్ మీడియాలో అనేక హృదయాలను గెలుచుకుంది.

ఈ వీడియోను అన్షుల్ పరీక్ పోస్ట్ చేసింది. “కలలకు వయసు అడ్డంకి కాదు, కష్టపడి పనిచేస్తేచాలని ఆమె నిరూపించింది” అని అన్షుల్ పరీక్ పేర్కొంది. తన తల్లిని చూసి గర్విస్తున్నట్లు చెప్పింది.

వీడియోలో తన తల్లిని అన్షుల్ ఏమి చేస్తున్నావు అని సాదాసీదాగా అడుగుతుంది. చిరునవ్వుతో ఆమె తల్లి స్పందిస్తూ “ఇది నా జీవితంలో వచ్చిన తొలి ఆదాయం. యూట్యూబ్ ద్వారా సంపాదించాను. నాకు 52 ఏళ్లు. 6 నెలల్లోనే ఇది సాధించాను. నేను చాలా కష్టపడే వ్యక్తిని” అని చెబుతుంది. మాట్లాడుతూనే తన ఫోన్‌లో ఆదాయానికి సంబంధించిన రుజువును చూపిస్తుంది. ఆమె ముఖంలో చిరునవ్వు విరబూసింది.