Gas Cylinder Price Hiked : రూ.15 పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌

జనాలపై మరోసారి భారం పెరిగింది. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మ‌ళ్లీ పెరిగింది. ఎల్‌పీజీ సిలిండ‌ర్‌పై రూ.15 పెరిగింది. పెరిగిన ఈ ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.

Gas  Cylinder Price Hiked : రూ.15 పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌

Lpg Cylinder Price Hiked By Rs 15

LPG Cylinder Price Hiked by Rs 15 :  జనాలపై మరోసారి భారం పెరిగింది. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మ‌ళ్లీ పెరిగింది. ఎల్‌పీజీ సిలిండ‌ర్‌పై రూ.15 పెంచారు. పెరిగిన ఈ ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. పెట్రోలియం కంపెనీలు ధ‌ర‌ను పెంచిన‌ట్లు తెలుస్తోంది. పెరిగిన ధ‌ర‌తో 14.2 కేజీల నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ఢిల్లీలో రూ.899కి వ‌స్తోంది. ఇక 5 కేజీల సిలిండ‌ర్ ఇప్పుడు రూ.502కు ల‌భిస్తుంది. ఇవాళ్టి నుంచే కొత్త ధ‌ర‌లు అమ‌లులోకి రానున్నాయి.కాగా 2021 జనవరి నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపు కొనసాగుతునే ఉంది.అలా గత 10నెలల్లో రూ.205 పెరిగింది.

తాజాగా పెరిగిన ఈ ధరలు ఒక్కో నగరంలో ఒక్కోలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 14.5 కిలోల సిలిండర్ ధర రూ. 899.50. ముంబైలో రూ. 899.50. భారతదేశంలోని మెట్రో నగరాల్లో అత్యధికంగా ఎల్‌పిజి సిలిండర్ కోల్‌కతాలో రూ. 926 కి లభిస్తోంది. చెన్నైలో 14.5 కిలోల వంట గ్యాస్ ధర రూ .915.50. ఇక హైదరాబాద్లో ఇండియన్ గ్యాస్ ధర రూ.937 నుంచి రూ.952కి పెరిగింది. పెరిగిన ఈ ధరలు బుధవారం అంటే అక్టోబర్ 6 అనగా ఈరోజునుంచే అమలులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించాయి.

Read more : Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అక్టోబర్ 1వ తేదీన కూడా గ్యాస్ ధరలను సవరించాయి. కమర్షియల్ గ్యాస్ ఎల్పీజీ ధరలను పెంచింది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరలను పెంచడానికి రెండు కారణాలు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గ్యాస్ రేట్ పెరుగుతున్నట్టు చెబుతున్నారు.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీని వల్ల ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఇవేవీ ప్రభుత్వాలకు పట్టవు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు అనుబంధంగా గ్యాస్ రేట్లు కూడా పెరగడంతో ప్రజల ఆగ్రహానికి కారణం అవుతోంది.

Read more : Auto Raja : రుషిగా మారిన నేరస్తుడు..ఇనుప సంకెళ్లతో అనాథల హక్కుల కోసం పోరాటం

ప్రతీ సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ సిలిండర్ బుక్ చేసిన తర్వాత కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా క్రెడిట్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో సబ్సిడీ రూపంలో ఎంతో కొంత వెనక్కి వస్తుండటం కస్టమర్లకు కాస్త ఊరటే. దాని వల్ల జనాలకు ఒరిగేది కూడా ఏమీలేదు. అయితే సబ్సిడీ ఎంత వస్తుంది అనేది ఆయా ప్రాంతాన్ని బట్టి మారుతుంది. సబ్సిడీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంటాయి.