Rahul Ravan vs Modi Puppet: కాంగ్రెస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్.. రాహుల్‌ను రావణుడితో పోల్చినందుకు మోదీని అదానీ పప్పెట్ అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి
అనంతరం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రధాని మోదీపై అదానీ పప్పెట్ అనే అర్థంలో పోస్టర్ విడుదల చేశారు. తోలుబొమ్మలాటకు స్పూఫ్ గా అదానీ అని రాసున్న అక్షాల్లోంచి వచ్చిన దారాలతో మోదీ పని చేస్తున్నట్టుగా రూపొందించారు.

Rahul Ravan vs Modi Puppet: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని రావణుడితో పోలుస్తూ భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన పోస్టర్ తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. దీనికి ప్రతిగా ప్రధానమంత్ర నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సైతం ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో ఆయనను వ్యాపారవేత్త అదానీ పప్పెట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా పోస్టర్ వార్ జోరుగా సాగుతోంది.
మొదట రాహుల్ గాంధీకి పది తలలు అతికించిన ఒక పోస్టర్ ను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది. అందులో ‘‘ఈ కాలపు రావణుడు. ఆయనే భూతం, ధర్మ వ్యతిరేకి, రాముడి వ్యతిరేకి, భారత్ ను ధ్వంసం చేయడమే ఆయన ధ్యేయం’’ అంటూ రాసుకొచ్చారు. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ నేతలు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
The new age Ravan is here. He is Evil. Anti Dharma. Anti Ram. His aim is to destroy Bharat. pic.twitter.com/AwDKxJpDHB
— BJP (@BJP4India) October 5, 2023
అనంతరం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రధాని మోదీపై అదానీ పప్పెట్ అనే అర్థంలో పోస్టర్ విడుదల చేశారు. తోలుబొమ్మలాటకు స్పూఫ్ గా అదానీ అని రాసున్న అక్షాల్లోంచి వచ్చిన దారాలతో మోదీ పని చేస్తున్నట్టుగా రూపొందించారు. అంటే ప్రభుత్వం అదానీ కనుసన్నల్లో ఉందని, అదానీ చెప్పినట్లుగానే నడుస్తుందని అర్థం స్ఫూరించేలా దాన్ని రూపొందించారు.
इनकी डोर उसके हाथ में है pic.twitter.com/Fl4aW7ZmxN
— Congress (@INCIndia) October 6, 2023