Prithvi-II Missile: పృథ్వీ-2 మిస్సైల్ పరీక్ష విజయవంతం

ఆశించినట్లుగానే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఒడిశాలోని బాలాసోర్లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7గంటల 40నిమిషాలకు చేసిన ప్రయోగం సక్సెస్ అయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Prithvi-II Missile: పృథ్వీ-2 మిస్సైల్ పరీక్ష విజయవంతం

Drdo

Prithvi-II Missile: ఆశించినట్లుగానే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఒడిశాలోని బాలాసోర్లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7గంటల 40నిమిషాలకు చేసిన ప్రయోగం సక్సెస్ అయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతోనే ఢీకొట్టింది.

పరీక్ష జరిపిన సమయంలో మిస్సైల్ అన్ని క్వాలిటీ పారామీటర్స్ తోనే ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే క్షిపణిని 2018 ఫిబ్రవరి 21 నైట్ టైంలో ఛండీపూర్ లోని ఐటీఆర్ వద్ద, గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా రాత్రి సమయాల్లో ప్రయోగించారు.

Read Also : వరుస మిస్సైల్ ప్రయోగాలతో కవ్విస్తున్న కిమ్..ఆందోళనలో దక్షిణకొరియా

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్ 350కిలోమీటర్ల పరిధి రేంజ్ ను కలిగి ఉంటుంది. రెండు లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్లతో ఉండే పృథ్వీ-2 మిస్సైల్‌కు 500/100 కిలోల వార్ హెడ్ లను మోసుకెళ్లగల సామర్థ్యం కలదు. 9మీటర్ల పొడవు, సింగిల్ స్టేజ్ లిక్విడ్ ఫ్యూయెల్ తో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్ ను తొలిసారిగా 1996లో ప్రయోగించారు.

DRDOఅభివృద్ధి చేసిన మొదటి క్షిపణి అయిన పృథ్వీ-2 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది.