Hathras బాధితుల్ని కలిసేందుకు వెళ్లిన Rahul Gandhiని తోసేసిన పోలీసులు

Hathras బాధితుల్ని కలిసేందుకు వెళ్లిన Rahul Gandhiని తోసేసిన పోలీసులు

కాంగ్రెస్ లీడర్ Rahul Gandhiని ఉత్తరప్రదేశ్ పోలీసులు కిందకు తోసేశారు. అతని తర్వాత ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటి సభ్యులను కలిసేందుకు వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ-నోయిడా హైవే మీద నడుచుకుంటూ హత్రాస్ చేరుకునేలోపే ఆపేశారు.

నేనొక్కడినే వెళతా: Rahul Gandhi

గుంపులుగా ఏర్పడకూడదంటూ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తోసేయడంతో… ‘నేనొక్కడినే ప్రశాంతంగా నిలబడతాను. లేదంటే నేనొక్కడినే వెళతాను. ఇక్కడి నుంచి హత్రాస్ వరకూ ఒంటరిగా వెళతాను’ అని చెప్పిన రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల మాట వినకుండా ఎదురెళ్లినందుకు తోసేయడంతో కిందపడిపోయారు.



తోటి కాంగ్రెస్ నాయకులు పట్టుకుని లేపారు. ప్రియాంక గాంధీ తనను కూడా కిందపడేసేందుకు తోసేశారని ఆరోపించారు.

నేనే చట్టాన్ని ఉల్లంఘించా: Rahul Gandhi

 

‘నన్నెందుకు అరెస్టు చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఏం ఉన్నాయి. నేను ఏ చట్టాన్ని ఉల్లంఘించానని’ అరెస్టు చేస్తున్నారంటూ.. రాహుల్ గాంధీ పోలీసుల్ని ప్రశ్నించారు. సెక్షన్ 188ప్రకారం.. అఫీషియల్ ఆర్డర్లు ధిక్కరించినందుకు అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. హత్రాస్ కు 142కిలోమీటర్ల ముందే ఢిల్లీకి సమీపంలో నోయిడా దగ్గర రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాన్వాయ్ ను అడ్డుకున్నారు.

కార్యకర్తలతో కలిసి కారు దిగి నడవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటిలోనే చాలా పెద్ద మొత్తంలో యూపీ పోలీసులు గుమిగూడి వారిని అడ్డుకున్నారు. ‘వారు ఒంటరిగా పాదయాత్ర చేస్తేనని అంటే.. అజయ్ సింగ్ బిష్త్ అలియాస్ యోగి ఆదిత్యనాథ్ దేనికి భయపడుతున్నారంటూ’ ఓ కాంగ్రెస్ లీడర్ రణదీప్ సర్జీవాలా ఆరోపించారు.



మిగిలిన రాజకీయ పార్టీలన్ని సంయుక్తంగా గాంధీలపై జరిగిన ఘటనను ఖండించాయి. ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పట్ల యూపీ పోలీసుల నిర్లక్ష్యాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య విలువలను తుడిచిపెట్టేస్తున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ లీడర్ శరద్ పవార్ ట్వీట్ చేశారు.

ప్రతిపక్షాల హక్కు:

ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్.. ‘విచక్షణారహితంగా చేస్తున్న పనులకు వ్యతిరేకంగా చేసే పనులను అడ్డుకోవడం ప్రతిపక్షాల హక్కు. ప్రజల గొంతును నొక్కేయలేరు. నిజాలను తుడిచిపెట్టలేరు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండిస్తున్నాం’ అని పోస్టు చేశారు.