Congress Party: ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌లో చర్చ.. 72గంటల్లో తుది నివేదిక..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తాను చేరితే తన పని విధానం ఎలా ఉంటుంది, బూత్ స్థాయి నుంచి అన్ని...

Congress Party: ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌లో చర్చ.. 72గంటల్లో తుది నివేదిక..

Prasanth Kishor

Congress Party: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తాను చేరితే తన పని విధానం ఎలా ఉంటుంది, బూత్ స్థాయి నుంచి అన్ని రాష్ట్రాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అధికార పార్టీ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముందుంచారు. తాజాగా మంగళవారం మరోసారి సోనియాగాంధీతో ఆమె నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. సోనియాతో పాటు కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, జయరాం రమేష్, అంబికా సోని, కేవి వేణుగోపాల్ ఉన్నారు. సుమారు ఆరు గంటల పాటు సుధీర్ఘంగా సాగిన వీరి చర్చల్లో కీలక ప్రతిపాదనలు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేతల ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

Sonia – Prasanth kishore: మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన సోనియా – ప్రశాంత్ కిషోర్

అయితే ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలో అందరి అభిప్రాయాలను సేకరించే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయినట్లు సమాచారం. ఇదే విషయంపై ప్రశాంత్ కిషోర్ తో భేటీ అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ప్రశాంత్‌ కిషోర్‌ ప్రతిపాదనలను పార్టీ పరిశీలన చేస్తుందని అన్నారు. ఇతరుల అంశాలపై కూడా చర్చించటం జరుగుతుందని, కాంగ్రెస్ అధినేత్రికి సోనియాగాంధీకి వచ్చే 72గంటల్లో తుది నివేదికను సమర్పించాలని ఆయన చెప్పారు. ఇప్పటికే సోనియాగాంధీ, కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిషోర్ పలు దఫాలుగా భేటీ అయ్యారు. మంగళశారం నాల్గో సారి సమావేశమై కీలక విషయాలపై సుదీర్ఘంగా సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలని, ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలని, ఇందుకు నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు ఏమిటి అనే విషయాలపై ప్రశాంత్ కిషోర్, సోనియా, కాంగ్రెస్ పెద్దల మధ్య చర్చజరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ తన తరుపు నుంచి కొన్ని కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

Prasanth Kishore: మోడీ గారడీని నమ్మకండి: ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సూచన

వీటిపై తుది నిర్ణయం ప్రకటించే ముందు దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతల నిర్ణయం తీసుకోవాలని సోనియాగాంధీ సూచించడంతో ఆమేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మూడు నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి నివేదికను సోనియాకు అందించే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలనపై కాంగ్రెస్ లోని అందరి నుంచి పూర్తిస్థాయి ఆమోదం వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లోని పాతతరం నేతలు కొందరు ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలను వ్యతిరేకించే అవకాశాలు ఉన్నట్లు గాంధీ కుటుంబం భావిస్తుంది. ప్రశాంత్ కిషోర్ రాక గాంధీ కుటుంబానికి రాబోయే కాలంలో కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టొచ్చనే వాదన పలువురు కాంగ్రెస్ నేతలనుంచి వినిపిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కాంగ్రెస్ లోని పలువురు నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరిత అది మరింత ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదన్న వాదన పలువురు కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తుంది.

Sonia – Prasanth kishore: మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన సోనియా – ప్రశాంత్ కిషోర్

మరోవైపు కాంగ్రెస్ పార్టీ బోర్డులోకి ఎన్నికల వ్యూహకర్తను తీసుకోవటం సరికాదన్న వాదనను పలువరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై దేశంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సోనియా నిర్ణయించినట్లు సమాచారం. ఈ నివేదికను 72గంటల్లో సోనియాగాంధీకి అందించేందుకు కాంగ్రెస్ పెద్దలు కసరత్తు మొదలు పెట్టారు. ఈ నివేదికలో మెజార్టీ అభిప్రాయం ప్రకారం సోనియా నిర్ణయం తీసుకుంటారా, ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది.