INDIAలోని ఆ గ్రామంలో భార్యలను అద్దెకిస్తారు… అదే సాంప్రదాయమట

  • Published By: Subhan ,Published On : May 29, 2020 / 05:37 AM IST
INDIAలోని ఆ గ్రామంలో భార్యలను అద్దెకిస్తారు… అదే సాంప్రదాయమట

మహిళల సాధికారత గురించి ఇండియాలో మాట్లాడుతూ ఉంటారు. క్రీడల్లో, విద్యలో, ఎంటర్‌టైన్‌మెంట్లో ముందున్నామని ఫీలవుతుంటారు. పురుషాధిక్యత ఉన్న సమాజంలో ఇంకా సంప్రదాయం చాటున మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. నగర గోడలకు అవతల ఉన్న పల్లెల్లో ఇంకా అన్యాయాలు అవధుల్లేకుండా జరుగుతూనే ఉన్నాయి. 

కేవలం పల్లెల్లోనే కాదు నగరాల్లోనూ ఈ ఆచారాలు వారి స్వేచ్ఛను చిదిమేస్తున్నాయి. భారతదేశంలోని గ్రామాల్లో భార్యలను అద్దెకిచ్చేవారు ఉన్నారనడమే దీనికి నిదర్శనం. ఇండియా.కామ్ అనే వెబ్‌సైట్ సమాచారం మేరకు అగ్రిమెంట్ చేసుకుని భార్యలను అద్దెకు ఇస్తారట. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి గ్రామంలో ధదీచా ప్రాత సంప్రదాయం అని పిలుస్తారు. 

భార్యను పొందలేని ధనికులు ఈ గ్రామం నుంచి అద్దెకు తీసుకుపోతుంటారు. వారికి పెళ్లి అయినా సరే. ధదీచా ప్రాత ప్రకారం.. ఓ వ్యక్తి తన భార్యను నెలవారీ లేదా సంవత్సరానికి సరిపడ అద్దెకు వేరొకరి ఇంటికి పంపొచ్చు. ఈ ఒప్పందంలో వారు రూ.10 స్టాంప్ పేపర్ పై సంతకాలు చేస్తారు. ఒకసారి గడువు పూర్తి అయిన తర్వాత ఆ వ్యక్తి మళ్లీ కాంట్రాక్ట్ కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. 

ఏసియా నెట్ న్యూస్ కథనం ప్రకారం.. గుజరాతీ వ్యవసాయ కూలీ అట్టా ప్రజాపతి తన భార్యను ఓ ధనికుడైన జమిందారి ఇంటికి అద్దెకు ఇచ్చాడు. దానికి అతనికి నెలకు రూ.8వేలు చెల్లించాలి. ఇది గుజరాత్-మధ్యప్రదేశ్ బెల్ట్ లో ట్రెండింగ్ బిజినెస్ అనే రూమర్లు నడుస్తున్నాయి. ఆ అద్దె ఖరీదు నెలకు రూ.500 నుంచి రూ.50వేల వరకూ ఉంటుందట. ఇందులో మధ్యవర్తులే పెద్ద మనుషుల్లా వ్యవహరిస్తుంటారు. 

Read:ఈఎంఐ కట్టలేదని ఏడు రెట్లు జరిమానా వేసిన బ్యాంకు