Fast&Furious: ఇది సినిమా కాదు.. కదులుతున్న ట్రక్‌లో బైక్‌పై వెళ్తూ చోరీ

దొంగతనం సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. హాలీవుడ్ సినిమాల్లో వెళ్తున్న ట్రక్‌లోకి చొరబడి..

Fast&Furious: ఇది సినిమా కాదు.. కదులుతున్న ట్రక్‌లో బైక్‌పై వెళ్తూ చోరీ

Bike Robbery

Fast&Furious: ఈ రేంజ్ దొంగతనం సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. హాలీవుడ్ సినిమాల్లో వెళ్తున్న ట్రక్‌లోకి చొరబడి పోయి విలువైన వస్తువులో, వాహనాలో దోపిడీ చేస్తుంటారు. సరిగ్గా అదే స్టైల్‌లో రియల్ లైఫ్ లోనూ జరిగితే.. జరిగిపోయింది. ట్రక్‌లో ఉన్న వస్తువులను బైక్‌పై వెళ్తూ ముగ్గురు యువకులు పట్టపగలు దొంగతనం చేసేశారు.

ట్రక్ వెనుకాలే వెళ్తున్న కార్ లో వ్యక్తి వీడియో తీసి ఈ ఘటనను యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. నిర్మానుష్యంగా ఉన్న హైవే కావడంతో వారి దొంగతనానికి బాగా అవకాశం కుదిరింది. ఖాళీగా ఉన్న హైవేపై మధ్యలో వెళ్తున్న ట్రక్ లోకి బైక్ మీద ఉన్న ముగ్గురిలో ఓ వ్యక్తి ఎక్కాడు.

కంటైనర్ డోర్ కు ఉన్న బోల్ట్ కట్టర్ ను కత్తిరించాడు. ఇదంతా ట్రక్ కదులుతుండగానే జరిగింది. ఇలా జరుగుతుంటే మిగిలిన ఇద్దరు ట్రక్ కు దగ్గర్లో బైక్ పోనిస్తూ ఉన్నారు. వాళ్లను పట్టుకోవడానికి కార్లో ఉన్న వ్యక్తి స్పీడ్ పెంచి సమీపిస్తుంటే పొమ్మంటూ చేతితో సైగలు చేస్తున్నారు. ఆ ట్రక్ లో ఏదో ఆయిల్ ఉన్నట్లుగా వీడియో తీసిన వ్యక్తి చెబుతున్నాడు.

హైవేలపై చాలా రకాలుగా దొంగతనాలు చూశాం. బ్యారికేడ్లు పెట్టడం, పోలీసుల్లా డ్రెస్ వేసుకుని చెక్ పోస్టులు పెట్టడం లాంటివి చేసి లూటీ చేస్తుంటారు. అవేమి కాకుండా ఇది కొత్త ట్రెండ్ లా కనిపిస్తుంది. ఇలా అమెరికాలో అయితే కామన్ గా జరుగుతూనే ఉంటాయి.

నిర్మానుష్యంగా ఉండే హైవేలను టార్గెట్ చేసుకుని ఈ దోపిడీలు చేస్తుంటారు. వీరంతా రోడ్ పై పెద్ద రాయి పెట్టడం, రోడ్ కు అడ్డంగా రాళ్లు పెట్టడం, కార్ అద్దాలపై గుడ్లు విసిరి కొట్టడం లాంటి చేస్తారు. అందుకే అటువంటి హైవేలపై వెళ్లాలనుకుంటే పగటి సమయంలోనే వెళ్లడం బెటర్.