పార్క్ లో స్పోర్ట్స్ బ్రా గొడవలో హీరోయిన్‌కు సారీ చెప్పిన కాంగ్రెస్ నేత, కేసు నమోదు

  • Published By: naveen ,Published On : September 8, 2020 / 12:46 PM IST
పార్క్ లో స్పోర్ట్స్ బ్రా గొడవలో హీరోయిన్‌కు సారీ చెప్పిన కాంగ్రెస్ నేత, కేసు నమోదు

బెంగళూరులో హీరోయిన్ సంయుక్త హెగ్డే స్పోర్ట్స్ బ్రా లో పార్కుకి వెళ్లడం, దీనిపై కాంగ్రెస్ నేత కవితా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, దాడి చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రచ్చ రచ్చ జరిగింది. కొందరు సంయుక్తను సపోర్ట్ చేస్తే మరికొందరు కవితారెడ్డికి మద్దతు తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వారు సంయుక్తకు అండగా నిలిచారు.



కాగా, సంయుక్త, కవితా రెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కవితా రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పార్క్‌లో స్పోర్ట్స్‌ బ్రా ధరించి సంయుక్త, ఆమె స్నేహితురాలు వ్యాయమం చేస్తుండగా అటుగా వెళ్లిన కాంగ్రెస్‌ నేత కవితా రెడ్డి వారిని వీడియో తీసి వారిపై దాడి చేశారు.
https://10tv.in/osama-bin-ladens-niece-declares-that-only-donald-trump-can-prevent-another-9-11/
ఈ వీడియోను నటి సంయుక్త హెగ్డే తన సోషల్‌మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసి ‘మహిళలు ఏం ధరిస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కారణాలతో వారిని హింసించడం సమాజం ఆపాలి’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా కవిత మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిగివచ్చిన కవిత సంయుక్తకు క్షమాపణలు చెప్పింది. తాను అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదన్నారు.





కవిత క్షమాపణలను అంగీకరిస్తున్నట్లు సంయుక్త తెలిపింది. ఇదంతా మరిచిపోయి ముందుకు సాగుదామని కోరింది. ప్రతి చోట మహిళలకు భద్రత ఉండాలి తాను కోరుకుంటున్నట్లు తెలిపింది.

అసలేం జరిగిందంటే:
క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై మూక‌దాడి జ‌రిగింది. శుక్ర‌వారం(సెప్టెంబర్ 4,2020) వ‌ర్క‌వుట్లు చేసేందుకు స్నేహితుల‌తో క‌లిసి సంయుక్త బెంగ‌ళూరులోని కోరమంగళలోని అగర పార్క్‌ కు వెళ్లింది. ఆమె స్పోర్ట్స్ బ్రాలో ఉంది. వర్కవుట్లు చేసుకుంటోంది.

అదే సమయంలో పార్కులోనే ఉన్న కాంగ్రెస్ నేత కవితా రెడ్డి, సంయుక్త దుస్తుల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. స్పోర్ట్స్ దుస్తులు ధ‌రించి ప‌బ్లిక్‌లోకి ఎలా వ‌స్తావంటూ దూష‌ణ‌కు దిగింది. పార్కులో ఉన్న మ‌రికొంద‌రు కూడా కవితా రెడ్డికి జతయ్యారు. అంతా కలిసి సంయుక్త‌తోపాటు ఆమె స్నేహితుల‌తో గొడవపడ్డారు. ఆ తర్వాత దాడి కూడా చేశారు. ఈ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న‌కు జ‌రిగిన చేదు అనుభ‌వాన్ని వెల్ల‌డించారు.



“స్పోర్ట్స్ బ్రా వేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చినందుకు చెప్ప‌రాని మాట‌లు అన్నారు. నా స్నేహితురాలు ఏమీ అన‌క‌ముందే ఆమెను కొట్ట‌డానికి వెళ్లారు. ఇక్క‌డ ఇంత జ‌రుగుతుంటే మాకు స‌హాయం చేయాల్సింది పోయి మ‌రికొంద‌రు మ‌గ‌వాళ్లు ఆమెకు తోడుగా నిలిచారు. డ్ర‌గ్స్ కేసులో ఇరికిస్తామ‌ని బెదిరించారు” అని సంయుక్త వాపోయారు.

కవితారెడ్డి త‌న‌పై చేసిన దాడి వీడియోను కూడా సంయుక్త ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా బెంగ‌ళూరు పోలీసులను కోరారు. తెలుగులో నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు 2తో పాటు యంగ్ హీరో నిఖిల్ కిర్రాక్ పార్టీ వంటి చిత్రాలతో పాటు పలు సినిమాల్లో నటించిన సంయుక్త హేగ్డే.. ఇపుడిపుడే హీరోయిన్‌గా బిజీ అవుతున్నారు. త‌మిళ, క‌న్న‌డ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తున్నారు.



ఈ ఘటనపై పెద్ద రచ్చే జరిగింది. కొందరు సోషల్ మీడియా వేదికగా సంయుక్త హెగ్డే తీరును తప్పుపట్టారు. మరికొందరు కవితారెడ్డి తీరుని ఖండించారు. ఈ దేశంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలో వేరే వాళ్లు చెప్పాలా.. ఆడవారికి స్వాతంత్య్రం లేదా అని నిలదీశారు.


 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) on

సంయుక్త తప్పును క్షమించేసినా పోలీసులు మాత్రం ఈ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీద ఐపీసీ సెక్షన్లు 323, 504(b)కింద కేసు పెట్టారు.