Jayalalithaa death case: విచారణకు నేను సిద్ధం.. జయలలిత వైద్యం విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదన్న శశికళ

ఆరుముగస్వామి నివేదికపై అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ స్పందించారు. నాపై వచ్చిన ఆరోపణలన్నింటినీ నేను ఖండిస్తున్నాను. జయలలిత వైద్యం విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. విచారణను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ శశికళ తెలిపింది.

Jayalalithaa death case: విచారణకు నేను సిద్ధం.. జయలలిత వైద్యం విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదన్న శశికళ

Jayalalithaa death case

Updated On : October 19, 2022 / 11:16 AM IST

Jayalalithaa death case: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై విచారణ జరిపిన ఆరుముగస్వామి విచారణ కమిటీ తమ నివేదికలో సంచలన వ్యాఖ్యలు చేసింది. జయలలిత మృతి విషయంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ, జయలలిత వ్యక్తిగత వైద్యుడు కెఎస్ శివకుమార్, అప్పటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, ఆరోగ్య మంత్రిగా ఉన్న సి.విజయభాస్కర్ తప్పు చేసినట్లు తేలిందని, వారిపై విచారణకు ఆదేశించాలని ఆరుముగస్వామి విచారణ కమిషన్ నిర్ధారించింది. ఈ నివేదికపై శశికళ స్పందించారు. జయలలిత మృతికేసు విషయంలో విచారణ ఎదుర్కొనేందుకు నేను సిద్ధమేనని తెలిపింది.

Jayalalithaa Death: జయలలిత మరణం వెనుక కుట్ర.. శశికళను విచారించాలి: శాసనసభలో జస్టిస్ ఆరుముగసామి కమిషన్​ నివేదిక

ఆరుముగస్వామి నివేదికలో నాపై వచ్చిన ఆరోపణలన్నింటినీ నేను ఖండిస్తున్నానని తెలిపింది. జయలలిత వైద్యం విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదని, విచారణను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె పేర్కొంది. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం జయలలిత మృతిపై విచారణ జరిపించాలని అభ్యర్థించడంతో 2016 సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన పరిస్థితి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి, తదుపరి చికిత్సపై విచారించేందుకు ఆరుముగస్వామి కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.

Jayalalithaa Death Case: మాజీ సీఎం జయలలిత చికిత్సలో అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన ఎయిమ్స్

ఈ విచారణలో భాగంగా జయలలిత సన్నిహితులు, చికిత్స అందించిన వైద్యులు, తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాకర్, అప్పటి ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, తమిళనాడు ఆర్థిక మంత్రి, ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు పన్నీర్‌సెల్వం వంటి వారితో పాటు కమిషన్ నవంబర్ 2017లో తన విచారణను ప్రారంభించింది. ఆరుముగస్వామి కమిటీ తన 608 పేజీల తుది నివేదికను తమిళంలో, 500 పేజీల నివేదికను ఆంగ్లంలో దాఖలు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జయలలితకు సంబంధించి 159 మందికి పైగా సాక్షులు ఆరుముగస్వామి కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే, మంగళవారం అసెంబ్లీలో విచారణ కమిషన్ నివేదికను సమర్పించిన తమిళనాడు ప్రభుత్వం, న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని పొందిన తర్వాత కొంతమంది వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.