Husband Arrested : వామ్మో.. మొగుడికి సినిమా చూపించింది.. పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్ట్ చేయించిన భార్య

ఇదే పెద్ద షాకింగ్ అనుకుంటే, ఇందులో అంతకు మించిన షాకింగ్ విషయం మరొకటి ఉంది. అరెస్ట్ చేయించిన ప్రతిసారి కూడా భార్యే.. Wife Gets Husband Arrested

Husband Arrested : వామ్మో.. మొగుడికి సినిమా చూపించింది.. పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్ట్ చేయించిన భార్య

Wife Gets Husband Arrested(Photo : Google)

Updated On : August 8, 2023 / 7:58 PM IST

Husband Arrested – Gujarat : మొగుడు పెళ్లాలు అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్. దంపతుల మధ్య పలు విషయాల్లో అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తుంటాయి. వాదులాటలు జరుగుతుంటాయి. తిట్టుకుంటారు, కొన్ని సందర్భాల్లో కొట్టుకుంటారు కూడా. అయితే అవన్నీ తాత్కాలికమే. మళ్లీ అన్ని మర్చిపోయి ఒక్కటైపోతారు. అదే భార్యభర్తల మధ్య ఉండే బంధం అంటే. అయితే, ఇందుకు పూర్తిగా భిన్నమైన సంఘటనలూ జరుగుతుంటాయి. కొన్ని మనల్ని షాక్ కి గురి చేస్తాయి. అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ భార్య తన భర్తను ఏకంగా ఏడుసార్లు జైలుకి పంపింది. అది కూడా పదేళ్ల వ్యవధిలోనే.

గుజరాత్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మెహసానాలో ఓ మహిళ తన భర్తపై గృహహింస కేసు పెట్టి అరెస్ట్ చేయించింది. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు. ఏకంగా 7సార్లు ఇలా అరెస్ట్ చేయించి జైలుకి పంపించింది. అదీ పదేళ్ల వ్యవధిలోనే.

Also Read: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే.. ఆ జంటకు విడాకులు మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు

సోనూ మాలి, ప్రేమ్ చంద్ మాలి 2001లో వివాహం అయ్యింది. కడిలో నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దాంతో గృహహింస కింద భర్తపై కేసు పెట్టింది భార్య. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 2015లో తొలిసారిగా భర్త అరెస్ట్ అయ్యాడు. అది మొదలు.. పదేళ్ల వ్యవధిలో ఏకంగా ఏడుసార్లు భర్తను అరెస్ట్ చేయించింది భార్య.

ఇదే పెద్ద షాకింగ్ అనుకుంటే, ఇందులో అంతకు మించిన షాకింగ్ విషయం మరొకటి ఉంది. అరెస్ట్ చేయించిన ప్రతిసారి కూడా భార్యే బెయిల్ మీద తన భర్తను విడుదల చేయించింది. కాగా.. భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించగా.. అది చెల్లించడంలో ప్రేమ్ చంద్ విఫలం అయ్యాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 5 నెలలు జైల్లో ఉన్నాడు. ఇంతలో అతడి భార్యే బెయిల్ మీద భర్తను బయటకు తీసుకొచ్చింది.

Also Read: ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో చిత్రీకరణ, బయటికి చెబితే చంపేస్తామని బెదిరింపులు

ఇప్పుడీ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల వ్యవధిలో 7సార్లు భర్తను భార్య అరెస్ట్ చేయించిన వైనం తెలిసి నివ్వెరపోతున్నారు. అరెస్ట్ చేయించేది ఆమే, మళ్లీ బెయిల్ పై బయటకు తీసుకొచ్చేది కూడా ఆమే అని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. వీళ్లేం దంపతులు రా నాయనా అని తల పట్టుకుంటున్నారు.