Singer Mangli Reaction : రాళ్ల దాడిపై స్పందించిన సింగర్ మంగ్లీ.. అసలేం జరిగిందో చెప్పిన గాయని

సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై సింగర్ మంగ్లీ స్పందించింది. ఇది దాడి కాదని మంగ్లీ చెప్పింది. దీనికి, తనకు సంబంధమే లేదంది. ఎందుకు ఇలా విష ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదంది.

Singer Mangli Reaction : రాళ్ల దాడిపై స్పందించిన సింగర్ మంగ్లీ.. అసలేం జరిగిందో చెప్పిన గాయని

Singer Mangli Reaction : కర్నాటక రాష్ట్రం బళ్లారిలో ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బళ్లారి ఉత్సవ్ లో పాల్గొన్న మంగ్లీని చూసేందుకు స్థానిక యువకులు ఎగబడ్డారు. వేదిక వెనుక ఉన్న మేకప్ టెంట్ లోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి యువకులను చెదరగొట్టారు. ప్రోగ్రామ్ తర్వాత మంగ్లీ కారులో వెళ్తుండగా.. ఆమె కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. కాగా, బళ్లారి ఉత్సవ్ లో తన పాటలతో బళ్లారి వాసులను అలరించింది మంగ్లీ. తాను త్వరలోనే కన్నడ భాష నేర్చుకుంటానని చెప్పారు.

మంగ్లీ కారుపై రాళ్ల దాడి వెనుక రెండు కారణాలు వినిపిస్తున్నాయి. తనకు కన్నడ భాష అర్థం కాదని గతంలో ఓ కార్యక్రమంలో మంగ్లీ అనిందని, దీనిపై ఆగ్రహానికి గురైన కన్నడ భాషాభిమానులు ఆమె కారుపై దాడి చేసి ఉంటారని తెలుస్తోంది. మరోవైపు బళ్లారి ఉత్సవ్ లో మంగ్లీని చూసేందుకు ఎగబడ్డ యువకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆ యువకులు మంగ్లీ కారుపై దాడి చేసి ఉంటారని మరో కారణంగా తెలుస్తోంది.

సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి వార్త కలకలం రేపింది. ఈ ఘటనపై స్వయంగా సింగర్ మంగ్లీ స్పందించింది. ఇది దాడి కాదని మంగ్లీ చెప్పింది. దీనికి, తనకు సంబంధమే లేదంది. ఎందుకు ఇలా విష ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె వాపోయింది.

Also Read..Singer Manglis Car Attacked : సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి, బళ్లారి ఉత్సవ్‌లో పాల్గొని వెళ్తుండగా ఘటన.. కారణం అదేనా?

”బళ్లారి ఉత్సవ్ లో నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. షో అద్భుతంగా జరిగింది. నన్ను మంచిగా చూసుకున్నారు. మంత్రి శ్రీరాములు, కలెక్టర్ పవన్, ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా చూసుకున్నారు. అసలు ఆ కారులో నేను లేను. నా కారుపై రాళ్ల దాడి అన్నది ఫేక్ న్యూస్. వాళ్లు చాలా ప్రేమ చూపించారు. అభిమానించారు. ఇలా విష ప్రచారం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. టీఆర్పీ రేటింగ్ కోసమో, మీడియా హైప్ కోపమో ఈ విష ప్రచారం చేస్తున్నారని అనిపిస్తోంది. అసలేం జరిగిందో నాకేమీ తెలీదు” అని మంగ్లీ వివరించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”సెలెబ్రిటీలను చూసేందుకో లేదా ఫోటోలు దిగడానికో జనరల్ గానే అభిమానులు వస్తారు. అలానే అభిమానులు వచ్చారు. వారికి ఫోటోలు ఇచ్చేశాను. అయిపోయింది. అంతేకానీ, ఎగబడ్డారు. అవన్నీ నాకు తెలియదు. నేను గ్రీన్ రూమ్ లోకి వెళ్లిపోయాను. బయట ఏం జరిగిందో నాకు తెలీదు. స్టేజ్ మీద ఉన్నప్పుడు తెలుగు మాట్లాడాలని కొంతమంది అడిగారు. నేను మాట్లాడలేదు. కన్నడ నేర్చుకోవాలనే తపనతో కన్నడనే మాట్లాడతాను అని చెప్పాను. కన్నడలో ట్రై చేస్తుంటాను. కన్నడ సాంగ్స్ కూడా ఇప్పడిప్పుడే నేర్చుకుంటున్నా. కన్నడ బాషాభిమానులు కక్ష కట్టి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. దాని గురించి నాకేమీ తెలీదు. అసలు ఎందుకిలా చేస్తున్నారో కూడా నాకు తెలీదు” అని సింగర్ మంగ్లీ చెప్పింది.