Krushna Rout: పార్టీకి పిలిచి.. బాగా తాగిపించి.. రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్ చొప్పించిన స్నేహితులు
పది రోజుల క్రితం స్నేహితుడు పార్టీకి పిలిస్తే గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులంతా పార్టీ చేసుకున్నారు. అందరూ కలిసి రౌత్‌కి బాగా తాగిపించారు. ఇక తాగిన మైకంలో ఉన్న రౌత్ రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్‌ను జొప్పించారు. ఆ మర్నాడు కడుపులో నొప్పి, నడవలేక ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులకు ఇది చెప్పడం ఇష్టం లేక ఒడిశాలోని తన గ్రామమైన గంజం బయల్దేరాడు.

Steel glass inserted inside man private parts by friends while he was intoxicated
Krushna Rout: కడుపు ఉబ్బిపోయి, మల విసర్జన కాలేని స్థితిలో ఆసుపత్రికి వెళ్లిన ఒక వ్యక్తికి షాకయ్యే నిజం కళ్లెదురైంది. ఎక్స్‌రే రిపోర్టు తీసి చూడగా అతడి రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్ కనిపించింది. అప్పటికే పది రోజులుగా లోపలే ఉంది. ఆసుపత్రికి వెళ్తే కానీ ఈ విషయం తెలియలేదు. ఒడిశాలోని బ్రహంపూర్ నగరంలో ఉన్న ఎంకేసీజీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వైద్యులు తాజాగా ఆపరేషన్ చేసి ఆ గ్లాస్‌ను విజయవంతంగా తొలగించారు. పది రోజుల క్రితం తాను గుజరాత్ వెళ్లిన సంఘటన గుర్తొచ్చింది. తాగిన మైకంలో ఉన్న సమయంలో తనపై స్నేహితులు పాల్పడ్డ దారుణమని గుర్తించి, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
బాధితుడి పేరు కృష్ణ రౌత్(45). పది రోజుల క్రితం స్నేహితుడు పార్టీకి పిలిస్తే గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులంతా పార్టీ చేసుకున్నారు. అందరూ కలిసి రౌత్‌కి బాగా తాగిపించారు. ఇక తాగిన మైకంలో ఉన్న రౌత్ రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్‌ను జొప్పించారు. ఆ మర్నాడు కడుపులో నొప్పి, నడవలేక ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులకు ఇది చెప్పడం ఇష్టం లేక ఒడిశాలోని తన గ్రామమైన గంజం బయల్దేరాడు.
అక్కడ కూడా ఎవరికీ చెప్పుకోలేదు. రోజురోజుకీ నొప్పి ఎక్కువవుతోంది. కడుపు ఉబ్బుతోంది. మలవిసర్జన చేయడం సాధ్యం కావడం లేదు. అయితే తన పరిస్థితి తెలియడంతో అతడి కుటుంబంలోని ఒక వ్యక్తి సలహాతో ఎంకేసీజీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ని సంప్రదించమని సలహా ఇచ్చాడు. రౌత్ ఆసుపత్రికి వెళ్లగా రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్ ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా వైద్యులు గర్తించారు. మొదట రిక్టమ్ పద్దతిలో బయటికి తీయడానికి ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో సర్జరీ చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని సదరు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
JNU: జేఎన్‌యూలో విద్యార్థులు, స్టాఫ్ మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు