JNU: జేఎన్‭యూలో విద్యార్థులు, స్టాఫ్ మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

ఏబీవీపీ విద్యార్థులు సోమవారం జేఎన్‭యూ అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని స్టాఫ్ అడ్డుకున్నారు. చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఏబీవీపి జేఎన్‭యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ సహా అదే సంఘానికి చెందిన పలువురు విద్యార్థులు గాయపడ్డట్లు ఆ సంఘం నేతలు చెప్పారు. అయితే ఇరు వర్గాల వారు గాయపడ్డట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

JNU: జేఎన్‭యూలో విద్యార్థులు, స్టాఫ్ మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

JNU students and staff clash over stalled scholarships

JNU: ప్రఖ్యాత జవహార్‭లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్కాలర్‭షిప్పుల విషయమై విద్యార్థులకు స్టాఫ్‭కు మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. జేఎన్‭యూ అడ్మినిస్ట్రేషన్ వద్దకు నిరసనగా వచ్చిన విద్యార్థులను యూనివర్సిటీ స్టాఫ్ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకోవడంతో ప్రారంభించి కొట్టుకునే వరకు వెళ్లింది. ఇందులో పలువురు గాయపడ్డట్లు సమాచారం.

రెండేళ్లుగా విద్యార్థుల స్కాలర్‭షిప్పులు విడుదల చేయడం లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులు సోమవారం జేఎన్‭యూ అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని స్టాఫ్ అడ్డుకున్నారు. చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఏబీవీపి జేఎన్‭యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ సహా అదే సంఘానికి చెందిన పలువురు విద్యార్థులు గాయపడ్డట్లు ఆ సంఘం నేతలు చెప్పారు. అయితే ఇరు వర్గాల వారు గాయపడ్డట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Bihar: టీచర్ అభ్యర్థులపై పోలీసు అధికారుల అమానుష దాడి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు