వింత ఆచారం : మహిళలు రుతుక్రమం సమయంలో ఇళ్లలో ఉండకూడదంట

మహిళలు రుతుక్రమం సమయంలో ఇళ్లలో ఉండకూడదంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది.

  • Published By: veegamteam ,Published On : January 19, 2019 / 11:55 AM IST
వింత ఆచారం : మహిళలు రుతుక్రమం సమయంలో ఇళ్లలో ఉండకూడదంట

మహిళలు రుతుక్రమం సమయంలో ఇళ్లలో ఉండకూడదంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది.

ఉత్తరాఖండ్‌ : శాస్త్రసాంకేతిక రంగాల్లో ముందున్నాం. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. కానీ మహిళలను వెనక్కు లాగే అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్‌ లో వింత ఆచారం మహిళలపై వివక్షకు ఉదాహరణగా చెప్పవచ్చు.

చంపావట్‌ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో రుతుక్రమం సమయంలో మహిళలు ఇంటి నుంచి దూరంగా ఉండాలనేది ఆచారంగా ఉంది. జిల్లాలోని మారుమూల గుర్చామ్‌ గ్రామంలోనైతే మహిళలు రుతుక్రమం సమయంలో ఇళ్లలో ఉండకూడదంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. వారికోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని ప్రభుత్వ నిధులతో నిర్మించడం గమనార్హం. దీనిపై ఉత్తరాఖండ్‌ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి విచారం వ్యక్తం చేసింది. ఈ కేంద్రాన్ని మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.