Uttar Pradesh : కూతురు పెళ్లి కోసం బ్యాంకు లాకర్‌లో ఉంచిన రూ.18 లక్షలకు పట్టిన చెదపురుగులు
చిన్నపాటి వ్యాపారం చేస్తూ, ట్యూషన్ తరగతులు నిర్వహిస్తున్న అల్కా పాఠక్ తన పొదుపును నగదు, నగల రూపంలో లాకర్‌లో ఉంచింది.

Termites Damage Cash
Uttar Pradesh Termites Damage Cash : యూపీలో కూతురు పెళ్లి కోసం ఓ మహిళ బ్యాంకు లాకర్‌లో ఉంచిన 18 లక్షల రూపాయల నోట్లకు చెదపురుగులు పట్టాయి. కరెన్సీ నోట్లు పనికి రాకుండా చెదపురుగులు కొరికివేశాయి. యూపీలోని మొరాదాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర పాటు బ్యాంకు లాకర్‌లో రూ.18 లక్షల నగదును ఉంచిన ఓ మహిళ తన డబ్బుకు చెదపురుగులు సోకిందని గుర్తించింది.
లాకర్ యజమాని అల్కా పాఠక్ తన కుమార్తె వివాహం కోసం బ్యాంక్ లాకర్‌లో 2022 అక్టోబర్‌లో కొన్ని నగలతో పాటు డబ్బును దాచి పెట్టారు. అయితే, లాకర్ వార్షిక నిర్వహణ, కేవైసీ ధృవీకరణ కోసం ఆల్కా పాఠక్ ను మేనేజర్ బ్యాంక్ కు పిలిపించారు. మహిళ లాకర్ ను తెరిచి చూడగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Cyber Crime: మహేష్ బ్యాంక్ చెస్ట్ అకౌంట్‌లో రూ. 12కోట్ల డబ్బు మాయం
లాకర్‌ని తెరిచి చూడగా, తన వద్ద ఉన్న నోట్లన్నీ చెదపురుగులు పట్టి పనికి రాకుండా పాడైపోవడం చూసి ఆమె షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆల్కా వెంటనే బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌కి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్యాంకులో ఆందోళన మొదలైంది.
చిన్నపాటి వ్యాపారం చేస్తూ, ట్యూషన్ తరగతులు నిర్వహిస్తున్న అల్కా పాఠక్ తన పొదుపును నగదు, నగల రూపంలో లాకర్‌లో ఉంచింది. లాకర్ భద్రపరచడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆమె తన కుమార్తె వివాహం కోసం కొన్ని విలువైన ఆభరణాలతో పాటు సుమారు రూ.18 లక్షలను ఉంచింది.
Chennai : క్యాబ్ డ్రైవర్ అకౌంట్లోకి రూ.9వేల కోట్లు .. షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్..!
బ్యాంక్ లాకర్‌లో నగదుతోపాటు విలువైన వస్తువులను భద్రపరచడానికి అవసరమైన నిర్దిష్ట పరిస్థితుల గురించి తనకు తెలియదని అల్కా అంగీకరించారు. ఈ పద్ధతిలో నిల్వ చేయలేమని తెలియకపోవడంతో డబ్బును డిపాజిట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.