Bengal Tigers: ఆడపులితో కలయిక కోసం బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి వస్తున్న పులులు

ఆడ పులితో జత కట్టేందుకు వేల కిలోమీటర్ల దూరం దట్టమైన అడవుల గుండా ప్రయాణించి పులులు 'సందర్బన్' ప్రాంతంలోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు.

Bengal Tigers: ఆడపులితో కలయిక కోసం బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి వస్తున్న పులులు

Tigers

Bengal Tigers: దేశాల మధ్య సరిహద్దులు మనుషులకేగాని..ఇతర జీవులకు కాదు. ప్రేమ కోసం కొందరు మనుషులు ఖండాంతరాలు దాటి వెళ్లిన ఘటనలు చాలానే చూశాం కాని..సహచర జోడీ కోసం జంతువులు సరిహద్దులు దాటడం గురించి ఎపుడైనా విన్నారా?. ముఖ్యంగా పులులు ఆహారం కోసం, సహచర జోడీ కోసం ఎంత దూరమైన ప్రయాణింస్తుంటాయి. ప్రపంచంలోనే విభిన్న క్రూరజంతువుగా చెప్పుకునే బెంగాల్ టైగర్లు ఇప్పుడు తమ సహచర ఆడ జోడీ కోసం వెతుకులాట ప్రారంభించాయట. భారత్ లోని బెంగాల్ కోస్తా తీరం నుంచి బంగ్లాదేశ్ తూర్పు తీరం వరకు వేల ఎకరాల్లో వ్యాపించి ఉన్న ‘సందర్బన్’ అటవీ ప్రాంతంలో ఈ భారీ పులులు నివసిస్తుంటాయి. కొన్ని రోజులు బంగ్లాదేశ్ వైపు, మరికొన్ని రోజులు..భారత్ లోని దట్టమైన ‘సందర్బన్’ ప్రాంతంలోనూ నివసిస్తుంటాయి ఈ పులులు.

Other Stories:Tirumala : మే 21 న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

కాగా, ఇటీవల కొన్ని మగ పులులు..ఆడ పులులను వెతుక్కుంటూ..బంగ్లాదేశ్ నుంచి భారత్ వైపు వస్తున్నట్లు బెంగాల్ అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆడ పులితో జత కట్టేందుకు వేల కిలోమీటర్ల దూరం దట్టమైన అడవుల గుండా ప్రయాణించి పులులు ‘సందర్బన్’ ప్రాంతంలోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ మంత్రి జ్యోతిప్రియ మాలిక్ తెలిపిన వివరాలు ప్రకారం..సాధారణంగా ఈ పులులు నవంబర్-జనవరి మధ్య జత కట్టేందుకు ఆడపులిని వెతుకుంటూ మగపులులు..సుందర్బన్ ధాటి వస్తుంటాయని..ఆ సమయంలో అడవిలో ఉండే గ్రామాలపై పులులు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

Other Stories: Uttar Pradesh : యూపీలో శ్రీరాముడి గుడిని అమ్మేసిన పాకిస్థాన్ వ్యక్తి..! దేవాలయాన్ని కూల్చేసి…హోటల్ నిర్మాణం

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పులులు స్థానిక గ్రామాల్లోని ప్రజలపై దాడి చేసిన నాలుగు ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు బెంగాల్ ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఈ సమయంలో ఆడపులిని వెతుకుంటూ మగపులులు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి రావడంపై అటవీశాఖ సిబ్బంది సైతం కొంత ఆలోచనలో పడ్డారు. ఇక్కడ మరొక ఆసక్తికర అంశం ఏమిటంటే..ఒక మగ పులి మరొక మగపులితో సరిహద్దులు పంచుకునేందుకు ఇష్టపడదు. అదే సమయంలో ఆడపులితో జతకట్టే విషయమై..ఆడ పులిని ఆకర్షించేందుకు మగపులులు దాడికి కూడా దిగుతాయి. ఈదాడిలో ఓడిపోయిన మగపులి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కనిపించకుండా మరొక చోటకి వెళ్ళిపోతుంది.