Bihar : ప్రాణం తీసిన పందెం.. 150 మోమోస్ తిని అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు, వెయ్యి రూపాయల కోసం..

Bihar Eating Momos : ఏకంగా 150 వరకు మోమోస్ తినేశాడు. అంతే, ఒక్కసారిగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెను వెంటనే స్పాట్ లోనే చనిపోయాడు.

Bihar : ప్రాణం తీసిన పందెం.. 150 మోమోస్ తిని అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు, వెయ్యి రూపాయల కోసం..

Bihar Eating Momos(Photo : Google)

Bihar Eating Momos : ఫ్రెండ్స్ తో సరదాగా పందాలు కాయడం కామన్. అయితే, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ హద్దులో ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, లిమిట్ క్రాస్ అయ్యారో.. పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు. తాజాగా ఓ యువకుడు తన ఫ్రెండ్స్ తో సరదాగా కాసిన పందెం అతడి చావుకి దారితీసింది. ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

బీహార్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పు చంపారన్ జిల్లా సిహోర్వాకు చెందిన విపిన్ కుమార్ పాశ్వాన్(23) మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. షాప్ కి అతడి ఫ్రెండ్స్ వచ్చారు. అంతా కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. తర్వాత మోమోలు తిందామని బయటకు వెళ్లారు. అక్కడ విపిన్ కుమార్ తన స్నేహితులతో మోమోస్ తినే పందెం కాశాడు.

Also Read..ATM Video: మీరు ఏటీఎంకు వెళ్తున్నారా? అయితే ఈ వీడియో చూసి అప్రమత్తం అవ్వాల్సిందే..

ఎవరు ఎక్కువ మోమోస్ తింటారో చూద్దాం అని చాలెంజ్ చేశాడు. ఎవరైతే ఎక్కువ మోమోస్ తింటారో వారికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పాడు. దాంతో అంతా సరే అన్నారు. ఫ్రెండ్స్ తో చాలెంజ్ కాసిన విపిన్ కుమార్ మోమోస్ తినడం ప్రారంభించాడు. అలా అతడు తింటూనే పోయాడు. ఏకంగా 150 వరకు మోమోస్ తినేశాడు. అంతే, ఒక్కసారిగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెను వెంటనే స్పాట్ లోనే చనిపోయాడు.

దీంతో అతడి స్నేహితులు షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే విపిన్ కుమార్ విగతజీవిగా కనిపించాడు. విపిన్ మరణంతో అతడి ఇంట్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, స్నేహితులే విషం పెట్టి తన కొడుకుని చంపారని విపన్ తండ్రి తీవ్ర ఆరోపణలు చేశారు.

పోస్టుమార్టం నిమిత్తం విపిన్ మృతదేహాన్ని గోపాల్ గంజ్ సదర్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ”విపిన్ తన స్నేహితులతో పందెం కాశాడు. పెద్ద సంఖ్యలో మోమోలను తిన్నాడు. దాంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని స్నేహితులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే విపిన్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు” అని థావే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) శశి రంజన్ కుమార్ తెలిపారు.

Also Read..israel : తెగిన తలను అతికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు .. వైద్య రంగంలో మిరాకిల్.

విపిన్ తండ్రి మాత్రం తన కొడుకుది ముమ్మాటికీ హత్యే అని ఆరోపిస్తున్నారు. స్నేహితులే విపిన్ ను చంపేశారని అంటున్నారు. “విపిన్‌ని ఇద్దరు స్నేహితులు గురువారం నాడు మోమోస్ తిందామనే నెపంతో దుకాణం నుండి తీసుకెళ్లారు. వారు అతనికి విషం ఇచ్చి చంపారు. వారు కూడా మాకు మరణం గురించి తెలియజేయలేదు. కొందరు వ్యక్తులు ఫుట్‌పాత్‌పై పడి ఉన్న మృతదేహాన్ని చూసి మాకు సమాచారం అందించారు”అని విపిన్ తండ్రి బిషున్ కుమార్ పాశ్వాన్ కన్నీటిపర్యంతం అయ్యారు.

విపిన్ తండ్రి చేసిన ఆరోపణలపై పోలీసులు స్పందించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే విపిన్ మరణానికి అసలు కారణం ఏంటో తెలుస్తుందన్నారు. అప్పటివరకు వేచి చూడాల్సిందే అన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.