Transgender Patna : ట్రాన్స్ జెండర్ల ఆగ్రహం…ప్రధాన రహదారుల దిగ్భందం

తరచూ తమపై దాడులు జరుగుతున్నాయని, ఏకంగా ఇప్పుడు హత్యలు చేయడంతో భయకంపితులవుతున్నామని తెలిపారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్ల హత్యలపై...

Transgender Patna : ట్రాన్స్ జెండర్ల ఆగ్రహం…ప్రధాన రహదారుల దిగ్భందం

Transgender Patna : ట్రాన్స్ జెండర్లు కన్నెర్ర చేశారు. రోడ్లపైకి వచ్చి హఠాత్తుగా నిరసన ప్రదర్శన చేశారు. వందలాది మంది ట్రాన్స్ జెండర్లు ప్రధాన రహదారులను దిగ్భందించారు. తమ కమ్యూనిటీకి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు హత్యకు గురి కావడమే వారి ఆందోళనకు కారణం. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది.

Read More : Lynching : 2014కి ముందు మూకదాడి పదమే వినలేదన్న రాహుల్..పితామహుడు రాజీవ్ గాంధీయేనన్న బీజేపీ

24 గంటల వ్యవధిలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. 2021, డిసెంబర్ 20వ తేదీ సోమవారం పాట్నాలో ఒకరు, 2021, డిసెంబర్ 21వ తేదీ మంగళవారం మరొక ట్రాన్స్ జెండర్ ను కాల్చి చంపారు. దీంతో ఆ కమ్యూనిటీకి చెందిన వారు ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులపై భారీగా ట్రాన్స్ జెండర్లు వచ్చారు.

Read More : సుబ్బారావు గుప్తాను ఇంటికి పిలిచిన మంత్రి బాలినేని

తరచూ తమపై దాడులు జరుగుతున్నాయని, ఏకంగా ఇప్పుడు హత్యలు చేయడంతో భయకంపితులవుతున్నామని తెలిపారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్ల హత్యలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇలాంటి హత్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టమైన హామీనిచ్చే వరకు తాము కదలబోమని ఖరాఖండిగా తేల్చేశారు.