Lynching : 2014కి ముందు మూకదాడి పదమే వినలేదన్న రాహుల్..పితామహుడు రాజీవ్ గాంధీయేనన్న బీజేపీ

కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. 2014కి ముందు దేశంలో మూకదాడులు ఉండేవి కావని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇవి

Lynching : 2014కి ముందు మూకదాడి పదమే వినలేదన్న రాహుల్..పితామహుడు రాజీవ్ గాంధీయేనన్న బీజేపీ

Rahul (1)

Lynching : కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. 2014కి ముందు దేశంలో మూకదాడులు ఉండేవి కావని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇవి ప్రారంభమయ్యాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం రాహుల్ ఓ ట్వీట్ చేశారు. 2014కు ముందు.. అంటే బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో ‘మూకదాడి’ అన్న పదం అంటే ఏంటో తెలియదు. ‘థ్యాంక్యూ మోదీజీ’ అంటూ ట్విట్టర్​లో ఎద్దేవా చేశారు రాహుల్. ఇక,రైతులు మరణించిన లఖింపుర్ ఖేరీ ఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టబోమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన వాళ్లు ఈరోజు లేదా తర్వాతైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు.

మూకదాడులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తిప్పికొట్టింది. మూకదాడుల పితామహుడు కాంగ్రెస్ నేత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీయేనని అంటూనే ఇందిరా హత్య అనంతరం జరిగిన అల్లర్లపై రాజీవ్ చేసిన వ్యాఖ్యలను ఉదాహరణ చూపుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 1984 అల్లర్లలో వందలమంది సిక్కుల హత్యలు మూకదాడి కాదా అని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ప్రశ్నించారు.1989లో జరిగింది మూకదాడి కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు చౌబే.

కాంగ్రెస్ పాలనలో 1969 నుంచి 1993 వరకు దేశంలో అనేక మూకదాడులు జరిగాయని బీజేపీ ఐటీ డిపార్ట్​మెంట్​ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్​ చేశారు. రాజీవ్ ఒకానొక సభలో మాట్లాడుతున్న వీడియోను అమిత్ మాలవీయ షేర్ చేస్తూ.. ‘‘సిక్కుల మారణహోమాన్ని సమర్ధిస్తున్న మూకదాడుల పితామహుడైన రాజీవ్ గాంధీని మీరు ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చి ‘రక్తానికి ప్రతీకారం రక్తంతోనే తీర్చుకుంటాం అని నినాదాలు చేశారు. సిక్కు మహిళలపై అత్యాచారాలు చేశారు. సిక్కు పురుషులను కుక్కలను విసిరేసినట్లు కాలుతున్న టైర్లలో విసిరేశారు’’ అని తెలిపారు.

ALSO READ Punjab Election : అకాలీదళ్ అధ్యక్షుడి బావమరిదిపై డ్రగ్స్ కేసు