Children-Two vaccines : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం..అద్భుతమైన ఫలితాలు

కరోనా థర్డ్ వేవ్ వస్తుందని..అది పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే అంచనాలతో నిపుణులు చిన్నారులకు కూడా వ్యాక్సిన్స్ ట్రయల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కొంతమంది చిన్నారులను ఎంపిక చేసిన వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ క్రమంలో యంగ్ చిల్డ్రన్స్ కు ఇచ్చిన రెండు డోసుల వ్యాక్సిన్లు అద్భుతంగా పనిచేశాయని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలింది. రెండు డోసులు వ్యాక్సిన్లు వేసిన పిల్లల్లో యాంటీబాడీలు అద్భుతంగా పెరిగాయని సైంటిస్టులు వెల్లడించారు. మెడెర్నాతో పాటు ప్రోటీన్-ఆధారిత ప్రయోగాత్మక టీకాలు పిల్లలకు.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు పరిశోధన తేలింది.

Children-Two vaccines : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం..అద్భుతమైన ఫలితాలు

Children Two Vaccines

Two Covid-19 vaccines for young children: కరోనా థర్డ్ వేవ్ వస్తుందని..అది పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే అంచనాలతో నిపుణులు చిన్నారులకు కూడా వ్యాక్సిన్స్ ట్రయల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కొంతమంది చిన్నారులను ఎంపిక చేసిన వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ క్రమంలో యంగ్ చిల్డ్రన్స్ కు ఇచ్చిన రెండు డోసుల వ్యాక్సిన్లు అద్భుతంగా పనిచేశాయని శుభవార్త తెలిసింది. రెండు డోసులు వ్యాక్సిన్లు వేసిన పిల్లల్లో యాంటీబాడీలు అద్భుతంగా పెరిగాయని సైంటిస్టులు వెల్లడించారు. మెడెర్నాతో పాటు ప్రోటీన్-ఆధారిత ప్రయోగాత్మక టీకాలు పిల్లలకు.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు పరిశోధన తేలింది. ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను సైన్స్​ ఇమ్యునాలజీ పత్రికలో మంగళవారం (జూన్ 15,2021) ప్రచురించారు.

కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికల మధ్య పిల్లలకు వేసిన వ్యాక్సిన్లు చక్కటి ఫలితాలు చూపించాయని నిపుణులు చెప్పిన ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి. థర్డ్ వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవచ్చే భరోసా వచ్చింది. దీంతో పిల్లలకు టీకా సురక్షితమైనవిగా తేలింది. కరోనా థర్డ్ వేవ్ నుంచి పిల్లలకు సమర్థవంతంగా సంరక్షించుకోవచ్చనే తేలింది.

మెడెర్నాతో పాటు ప్రోటీన్-ఆధారిత ప్రయోగాత్మక టీకాలు పిల్లలకు.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. పిల్లల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి టీకాలు కీలకమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మేరకు కోతి జాతికి చెందిన రీసస్‌ మకాక్‌ (ఆఫ్రికన్‌లాంగూర్‌) పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీల్లో చక్కటి మార్పులు వచ్చి ప్రతిస్పందిస్తున్నట్లుగా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను సైన్స్​ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించారు. ఈ వ్యాక్సిన్ల ప్రయోగాలు 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు చేశామని ఈ విషయంలో మరింతగా అర్థం చేసుకోవడానికి మరో సంవత్సరం పాటు ప్రయోగాలు కొనసాగిస్తామని తెలిపారు.

రెండున్నర నెలల వయసున్న కోతి పిల్లలను రెండు గ్రూపులుగా డివైడ్ చేసి వాటికి వ్యాక్సిన్లు ఇచ్చాం. ఆ తరువాత ఆ రెండు గ్రూపుల కోతిపిల్లలను నాలుగు వారాల తరువాత పరిశీలించాం. ఈ నాలుగు వారాల మధ్యలో వాటిలో రోగనిరోధక శక్తి చక్కగా పెరిగాయని పరిశోధకులు తెలిపారు. ప్రతి జంతువుకు ప్రీక్లినికల్​​ మోడెర్నా, mRNA టీకా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అలెర్జీ అండ్​ ఇన్ఫెక్షియస్​ డిసీజెస్​ (ఎన్​ఐఏఐడీ) అభివృద్ధి చేసిన ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ ఇచ్చారు. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా వైరస్ ఉపరితల ప్రోటీన్, స్పైక్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి చక్కటి ఇష్ట్రక్షన్స్ అందిస్తోందని వెల్లడించారు.

వ్యాక్సిన్​.. స్పైక్​ ప్రోటీన్‌న్లను సృష్టించమని కణాలకుచక్కటి సూచనలిచ్చి నిర్దేశిస్తుంది. ఇది వైరస్.. మానవ శరీరంలోని అన్ని భాగాలకు ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. దీంతో రోగనిరోధక కణాలు ప్రోటీన్‌ను గుర్తించి యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. NIAID టీకాలోనే స్పైక్​ ప్రోటీన్​ ఉంటుంది. దాన్ని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి అదే పరిమాణంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండు వ్యాక్సిన్లు ఇమ్యునోగ్లోబులిన్ జీని తటస్థీకరించి, కరోనా, స్పైక్ ప్రోటీన్-నిర్దిష్ట టీ కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి అవుతాయని పరిశోధకులు తెలిపారు. అయితే వ్యాక్సిన్లు.. టీ హెల్పర్ టైప్ 2పై ఎలాంటి ప్రభావం చూపలేదని, ఇది పిల్లల్లో భద్రతకు హాని కలిగిస్తుందని.. అలాగే యాంటీబాడీలు ఎదుర్కొని.. చిన్నపిల్లల్లో టీకా అభివృద్ధికి ఆటంకం కలిస్తాయి.

కాబట్టి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అయితే పెద్దలకు ఇచ్చే 100 మైక్రోగ్రామ్ డోసుకు బదులుగా.. 30 మైక్రోగ్రాముల డోసు పిల్లలకు ఇచ్చినట్లయితే.. శక్తిమంతమైన ప్రతిరోధకాల వయోజనుల్లో పెరిగిన స్థాయితో పోల్చవచ్చు అని పరిశోధకుల్లో ఒకరైన అమెరికాలోని నార్త్​ కరోలినా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ క్రిస్టినా డి పారిస్​ తెలిపారు. మోడెర్నా టీకాతో, నిర్దిష్ట బలమైన టీ-కణాలు ప్రతిస్పందిస్తాయని.. ఇవి వ్యాధి తీవ్రతను ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. సురక్షితమైన, సమర్థమైన టీకాలు.. పిల్లల్లో కరోనా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలకు సంబంధించిన వివరాలను చక్కగా వివరించారు. ఏది ఏమైనా థర్డ్ వేవ్ నుంచి చిన్నారులను రక్షించుకోవాలని పరిశోధకులు చెప్పిన వివరాలను బట్టి ఇది చాలా మంచి శుభపరిణామం అని అనుకోవచ్చు. పిల్లలను కాపాడుకోగలం అనే భరోసాలను ఇచ్చాయి ఈ పరిశోధనలు.