UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!

క్రేత్రస్థాయిలోనూ పార్టీ బలహీనంగా ఉండడంతో కాంగ్రెస్‌ కోరుకున్నదేదీ జరగలేదు. భారీగా హామీలిచ్చినప్పటికీ..యూపీ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు.

UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!

Up Congress Priyanka Gandhi

UP Congress- Priyanka : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దారుణంగా భంగపడ్డ మరో పార్టీ కాంగ్రెస్. ప్రియాంకగాంధీ కూడా కాంగ్రెస్ హస్తవాసిని మార్చలేకపోయింది. ప్రియాంక ఉత్తర్‌ప్రదేశ్‌ను రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకుని..సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ ఫలితం కనిపించలేదు.

Read This : Rajasthan :‘‘అత్యాచారాలలో రాజస్థాన్ నెంబర్ 1 నో డౌట్..ఎందుకంటే ఇది పురుషుల రాష్ట్రం కాబట్టి’’:అసెంబ్లీలో మంత్రి

బీజేపీ కన్నా ఎక్కువగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం, హథ్రాస్ ఆందోళనలు, హథ్రాస్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్ కేటాయింపు, రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం వంటివేమీ కాంగ్రెస్ ఓటుబ్యాంకును పెంచలేకపోయాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడింది.

అతిపెద్దరాష్ట్రం యూపీలో ఆత్మవిశ్వాసానికి బదులు అతివిశ్వాసం కనబర్చింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా 403 స్థానాల్లోనూ సొంతంగా పోటీచేసింది. అయితే ప్రియాంక గాంధీ మినహా బలమైన నేత లేకపోవడం, జాతీయ స్థాయిలో బలహీనంగా ఉండడం కాంగ్రెస్ కొంపముంచాయి.

ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోయింది కాంగ్రెస్. సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉండడం, క్రేత్రస్థాయిలోనూ పార్టీ బలహీనంగా ఉండడంతో కాంగ్రెస్‌ కోరుకున్నదేదీ జరగలేదు. భారీగా హామీలిచ్చినప్పటికీ..యూపీ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు.

Read This : Modi- Yogi : యూపీలో చరిత్ర తిరగరాసిన బీజేపీ.. మోదీ-యోగీ డబుల్ ధమాకా

యూపీలో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలివే..
1. పొత్తులు లేకపోవడం
2. అతిపెద్ద రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడం
3. అతి విశ్వాసం
4. ప్రియాంకగాంధీ చరిష్మా పనిచేయకపోవడం
5. ప్రియాంక గాంధీ మినహా బలమైన నేత లేకపోవడం
6. జాతీయ స్థాయిలో బలహీనంగా ఉండడం
7. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోవడం
8. సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉండడం
9. క్రేత్రస్థాయిలోనూ పార్టీ బలహీనంగా ఉండడం
10. ప్రజాకర్షక ఎన్నికల హామీలు ఇవ్వలేకపోవడం