Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

తాజా నిర్ణయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఛత్తీస్‭గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాల సరసన చేరింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

UP govt's Diwali gift for its employees and pensioners, hikes DA by 4%

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఉద్యోగులకు 4 శాతం నుంచి 38 వరకు డీఏ (కరువు భత్యం) పెంచనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. దీపావళి వస్తున్న నేపథ్యంలో పండగ బొనాంజాగా ఉద్యోగులకు ఈ పెంపును అందించనుంది యోగి ప్రభుత్వం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

‘‘ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ పొందే వారికి డీఏ, డీఆర్‭ను 38 శాతం వరకు పెంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూలై 1, 2022 నుంచి పరిగణలోకి వస్తుంది. అంతే కాకుండా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగులకు 6,908 రూపాయల బోనస్ కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది’’ అని ట్వీట్ చేశారు. చివరలో ‘అందరికీ అభినందనలు’’ అని రాసుకొచ్చారు.

కాగా, తాజా నిర్ణయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఛత్తీస్‭గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాల సరసన చేరింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

Pawan Kalyan: నన్ను ప్యాకేజి స్టార్ అనే సన్నాసి కొడుకులు ఎవరు.. వారిని చెప్పు తీసుకొని కొడతా