Viral Video : ఛీ..ఛీ.. యూనివర్సిటీ క్యాంటీన్‌లో దారుణం, కాళ్లతో తొక్కుతూ ఆహారం తయారీ.. షాకింగ్ వీడియో

ఛీ..ఛీ.. మీరసలు మనుషులేనా అని మండిపడుతున్నారు. ఇలా కాళ్లతో తొక్కి తయారు చేసిన ఆహారాన్ని తినేది లేదని.. Viral Video - Haryana

Viral Video : ఛీ..ఛీ.. యూనివర్సిటీ క్యాంటీన్‌లో దారుణం, కాళ్లతో తొక్కుతూ ఆహారం తయారీ.. షాకింగ్ వీడియో

Viral Video - Haryana (Photo : Google)

Viral Video – Haryana : హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ క్యాంపస్ లో క్యాంటీన్ సిబ్బంది దారుణానికి ఒడిగట్టారు. విద్యార్థులు తినే ఆహారాన్ని కాళ్లతో తొక్కుతూ తయారు చేస్తున్నారు. పెద్ద కంటైనర్ లో ఉడికించిన బంగాళాదుంలపు కాళ్లతో తొక్కారు. అలా క్యాంటీన్ సిబ్బంది ఒకరు పెద్ద పాత్రలోకి దిగి బంగాళాదుంలపు కాళ్లతో తొక్కుతుండగా.. కొందరు విద్యార్థులు వీడియో తీశారు. దాంతో ఈ దారుణం వెలుగుచూసింది. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.

క్యాంటీన్ సిబ్బంది తీరుపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఛీ..ఛీ.. మీరసలు మనుషులేనా అని తిట్టిపోస్తున్నారు. ఇలా కాళ్లతో తొక్కి తయారు చేసిన ఆహారాన్ని తాము తినేది లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. (Viral Video – Haryana)

Also Read..Viral Video : వామ్మో.. మద్యం మత్తులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన మహిళ, పచ్చి బూతులు తిడుతూ పోలీసులపైనే దాడి

మెస్ కు చెందిన సిబ్బంది ఒకరు.. ఓ పెద్ద కంటైనర్ లోకి దిగి అందులోని ఆలు గడ్డలను కాళ్లతో తొక్కుతూ ఉంటాడు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఇది చాలా దారుణం అంటున్నారు విద్యార్థులు. ఇలా తయారు చేసిన ఆహారాన్ని మాకు వడ్డిస్తున్నారా? మీరుసలు మనుషులేనా? అని మండిపడుతున్నారు. ఇంత అపరిశుభ్రతతో చేసిన ఆహారం తింటే తమ ఆరోగ్యం ఏం కావాలని విద్యార్థులు వాపోతున్నారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు.. ఇకపై మెస్ లో ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. మెస్ సిబ్బంది తీరుని విద్యార్థులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించిన మెస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వర్సీటీ అధికారులను డిమాండ్ చేశారు.

ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి చెందిన మెస్ సిబ్బంది ఉడకబెట్టిన బంగాళాదుంపలను కాళ్లతో నలిపివేయడానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఇలా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసిన ఆహారాన్ని తినడం మానేశారు విద్యార్థులు. క్యాంటీన్ లో తయారు చేసి తమకు వడ్డిస్తున్న ఆహార భద్రతపై విద్యార్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.(Viral Video – Haryana)

Also Read..CPR : సీపీఆర్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? గుండెపోటు బాధితుల ప్రాణాలు ఎలా కాపాడుతుంది? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

ఆహారం తయారు చేసే సిబ్బందిలో ఒకడు.. షార్ట్ వేసుకుని ఉన్నాడు. అతడు పెద్ద కంటైనర్‌లోకి దిగాడు. అందులో ఉంచిన ఉడికించిన బంగాళాదుంపలను చూర్ణం చేయడానికి తన పాదాలను ఉపయోగించాడు. కాళ్లతో తొక్కుతూ వాటిని నలిపాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో వర్సిటీ అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాము. JGU కమ్యూనిటీ సభ్యులు తినడానికి ఆహార పదార్థాలను ఉపయోగించరాదని మేము నిర్ధారించాము. తక్షణ చర్యగా, మేము ఈ విషయంపై రాతపూర్వక వివరణ, హామీని కోరుతూ కంపెనీ CEOకి షో-కాజ్ నోటీసు జారీ చేశాము. ఆహారం, భోజన సేవలకు సంబంధించి ఇటువంటి దారుణమైన పద్ధతులకు పాల్పడే వారందరిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాము” అని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.