బాబా కా ధాబాకు వెళ్లి తినండి.. ఆ దంపతుల కన్నీళ్లు తుడవండి

బాబా కా ధాబాకు వెళ్లి తినండి.. ఆ దంపతుల కన్నీళ్లు తుడవండి

babakadhaba:దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రాంతంలో BabaKaDhaba పేరుతో వృద్ధ దంపతులు హోం ఫుడ్ ను.. చిన్న స్టాండ్ పెట్టుకుని అమ్ముతున్నారు. లాభం చూసుకోరు. రెండో రోజు కావాల్సిన కూరగాయలు కొనేంత డబ్బులు వస్తే చాలు. ఇదిప్పుడే చేస్తున్న పని కాదు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు.

కాకపోతే కరోనావైరస్ సంక్షోభం వల్ల వారి మనగడకు కష్టంగా మారింది. దీనిపై సెలబ్రిటీలు, వేల కొద్ది జనం, క్రికెటర్లు, కంపెనీల నుంచి స్పందన వస్తుంది. రాత్రి 10గంటల సమయంలో చేసిన ట్వీట్ ఈ ప్రభంజనం సృష్టించింది.



వసుంధర టంఖా శర్మ అనే వ్యక్తి ఓ ఫుడ్ బ్లాగర్ చేత చేయించిన వీడియో.. మనసులు కదిలించింది. ‘నా గుండె పగిలింది. ఢిల్లీ వాసులారా.. ప్లీజ్ అక్కడకు వెళ్లి బాబా కా ధాబాలో తినండి. అవకాశం ఉంటే మాల్వియా నగర్ కు ఒక్కసారి వెళ్లండి’ అంటూ పోస్టు పెట్టింది.

అంతే.. గురువారం ఉదయం బాబా కా ధాబా ట్విట్టర్ టాప్ ట్రెండ్స్ లో ఒకటి అయిపోయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా..

8ఏళ్ల కంతా ప్రసాద్.. అతని భార్య కలిసి ఉదయం 6గంటల 30నిమిషాలకు వంట చేయడం మొదలుపెడతారు. అది 9గంటల 30నిమిషాలకల్లా రెడీ అయిపోతుంది. పప్పు, కూర, పరోటాలు, బియ్యం, పెద్ద వంటలు కేవలం ప్లేట్ రూ.30-50వరకూ ఉంటుంది.

కంతా ప్రసాద్ ఆరెంజ్ కలర్ టీ షర్టులో మాస్కు ధరించుకుని కనిపిస్తున్నాడు. ఎంత సంపాదించావని అడిగేసరికి అతని కన్నీళ్లు ఆగలేదు. క్యాష్ బాక్స్ లో నుంచి రూ.10 మాత్రమే తీసి చూపించాడు. నాలుగు గంటల్లో వాళ్లకు వచ్చింది కేవలం రూ.50మాత్రమే అంట.

వాళ్లెప్పుడూ పెద్ద మొత్తంలో లాభాల కోసం చూడలేదు. మహమ్మారి వారి చిన్న వ్యాపారాన్ని నీరుగార్చింది. ఈ విషయం తెలిశాక చాలా మంది ఆ వృద్ధ దంపతులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బాబా కా ధాబాలో లంచ్ చేస్తామంటూ మరి కొందరు సెలబ్రిటీలు మాటిచ్చారు.

అందులో సోనమ్ కపూర్, రవిచంద్రన్ అశ్విన్, ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో లాంటి వారంతా స్పందించారు.