Caste Census: గెలిస్తే కులగణన చేస్తామని రాహుల్, ప్రియాంక హామీలిస్తున్నారు.. మరి ఇప్పుడెందుకు చేయరు?

వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.

Caste Census: గెలిస్తే కులగణన చేస్తామని రాహుల్, ప్రియాంక హామీలిస్తున్నారు.. మరి ఇప్పుడెందుకు చేయరు?

Caste Census: బిహార్ రాష్ట్రంలో జరిగిన కులగణనతో దేశవ్యాప్తంగా పెద్ద చేర్చ లేసింది. రాజకీయంగా సామాజికంగా ఉపాధిపరంగా ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి అయితే చర్చ మరింత తీవ్రంగా జరుగుతోంది. దీన్ని రాజకీయ అవకాశంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. కులగణన అంశాన్ని రాహుల్ గాంధీ ప్రధానంగా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే కులగణన చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనాభా ప్రకారంగా పదవుల్లో ఉద్యోగాల్లో ప్రాధినిత్యం రావాలంటూ రాహుల్ గాంధీ తరుచూ అంటుండడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Sai Soujanya : నిర్మాతగా సినిమాల్లో త్రివిక్రమ్ వైఫ్ వర్క్ ఏంటో తెలుసా? క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

అయితే ఇక్కడొక ఆసక్తికర విషయం గమనించాలి. రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఈ ఎన్నికల్లో తాము గెలవగానే కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఛత్తీస్‭గఢ్‭లో పర్యటించిన ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ హామీనే ఇచ్చారు. విచిత్రం ఏంటంటే.. ఈ రెండు రాష్ట్రాల్లో గత నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అయితే తాము మళ్లీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీలు ఇస్తుండడం గమనార్హం.

వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది. మండల్ రిజర్వేషన్ల అమలు అనంతరం ఇది బాగా బలపడింది. అయితే దేశ పాలకులు ఈ అంశాన్ని పక్కన పెట్టారు. సాధారణ జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలను మాత్రమే లెక్కిస్తున్నారు. వారితో పాటు ఓబీసీలను కూడా లెక్కించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.

ఇది కూడా చదవండి: Hunza Valley: పాకిస్తాన్‭లో రహస్యమైన స్వర్గం.. అక్కడ 80 ఏళ్లు మహిళలు యవ్వనంగానే ఉంటారు

అయితే తాజాగా బిహార్ రాష్ట్రంలో కులగణన నిర్వహించిన అనంతరం.. రాష్ట్రాలు కూడా కులగణన చేయొచ్చనేది స్పష్టమైంది. దీంతో ప్రస్తుతం అన్ని రాష్ట్రాలపై కులగణన ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఛత్తీస్‭గఢ్‭, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇది మేనిఫెస్టో అంశంగా కూడా మారుతోంది. అయితే ఇప్పటికే ఛత్తీస్‭గఢ్‭, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇప్పుడే కులగణన ప్రారంభించవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో గెలిచాక చేస్తామని ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.