Campa Cola :  కాంపా కోలా బ్రాండెడ్ డ్రింక్‌లకు పోటీ కానుందా? పానీయాల మార్కెట్లను ముఖేశ్ అంబానీ షేక్ చేస్తారా..?

చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ ఓ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ వార్తల్లోకి వచ్చింది. అదే.. కాంపా కోలా. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ డ్రింక్ ని మార్కెంట్ లోకి తేవటానికి రెడీ అయ్యారు ముఖేశ్ అంబానీ. మరి కాంపాకోలతో కోకాకోలా, పెప్సీ లాంటి బ్రాండ్లకు.. గట్టి పోటీ ఇవ్వనుందా? ఇండియా అంతటా కాంపా కోలాను తాగించేందుకు అంబానీ రెడీ అయిపోయారు.

Campa Cola :  కాంపా కోలా బ్రాండెడ్ డ్రింక్‌లకు పోటీ కానుందా? పానీయాల మార్కెట్లను ముఖేశ్ అంబానీ షేక్ చేస్తారా..?

Campa Cola

Campa Cola:  చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ ఓ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ వార్తల్లోకి వచ్చింది. అదే.. కాంపా కోలా. ఈ జనరేషన్‌కి దీని గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ.. కొన్నేళ్ల క్రితం.. ఇండియన్ మార్కెట్‌ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు.. మళ్లీ కోకాకోలా, పెప్సీ లాంటి బ్రాండ్లకు.. గట్టి పోటీ ఇచ్చేందుకు రాబోతోంది. ఎందుకంటే.. కాంపా కోలా కంపెనీ ఇప్పుడు ముఖేశ్ అంబానీ చేతుల్లోకి వచ్చింది. వచ్చే దీపావళికే.. ఇండియా అంతటా కాంపా కోలాను తాగించేందుకు అంబానీ రెడీ అయిపోయారు.

ఇప్పుడు.. ఇండియన్ బిజినెస్ రంగంలో జరుగుతున్న డీప్ డిస్కషన్ ఇదే. ఇప్పటికే.. జియోతో.. టెలికాం మార్కెట్ లెక్కలన్నీ మార్చేశారు ముకేశ్ అంబానీ. దిగ్గజ టెలికాం కంపెనీలు కూడా అమాంతం దిగొచ్చేలా చేశారు. జియో తెచ్చిన డేటా రెవల్యూషన్‌తో.. అంతా స్మార్ట్ ఫోన్లకు అప్ గ్రేడ్ అయిపోయారు. అతి చౌక ధరలకే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో.. ఇండియా కూడా ఎంతో అప్ గ్రేడ్ అయింది. ఇప్పుడు అదే అంబానీ.. కొత్తగా సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు. భారత మార్కెట్‌లో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు పెప్సీ, కోకాకోలాకు పోటీగా.. కాంపా కోలానూ మార్కెట్‌ చేయబోతున్నారు. ఇదే.. ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అంబానీ.. కాంపా కోలాను కొన్నారు.. దీపావళికి లాంచ్ చేయబోతున్నారు.. అంతా బానే ఉంది. ఈ బ్రాండ్ అప్పట్లో ఇన్ స్టంట్ హిట్. కానీ.. ఇప్పుడు మళ్లీ మార్కెట్‌లోకి వస్తే.. కోకా కోలా, పెప్సీ లాంటి బ్రాండ్లకు పోటీ ఇవ్వగలదా? పబ్లిక్ మళ్లీ టేస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కానీ.. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ అవసరం లేదంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే.. 2030 నాటికి ఇండియాలో నాన్-ఆల్కహాలిక్ బేవరేజ్ మార్కెట్‌.. లక్షా 47 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలున్నాయ్. ఇప్పుడర్థమైందిగా.. అంబానీ లెక్కలేమిటో.

Campa Cola: క్యాంపా‌కోలా మళ్లీ వచ్చేస్తోంది..! దీపావళి నుంచి మార్కెట్‌లోకి..? ఈసారి మూడు రుచుల్లో..

మనమంతా రెగ్యులర్‌గా.. నీళ్లు తాగినట్లు కూల్ డ్రింక్స్ ఏమీ తాగేయం. కానీ.. దాని మార్కెట్ దానిదే. మనకు తెలియకుండానే.. కోట్ల లీటర్లు సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తున్నాం. సరదాగా సినిమాకెళ్లినప్పుడో.. ఫ్రెండ్స్ కలిసినప్పుడో.. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడో.. ఇలా.. ఏదో ఒక సందర్భంలో సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తున్నాం. అందువల్ల మార్కెట్‌లో.. వాటికి డిమాండ్ మామూలుగా లేదు. భవిష్యత్‌లో.. భారత్ నాన్-ఆల్కహాలిక్ బేవరేజ్ హబ్‌గా మారే అవకాశం ఉందనే రిపోర్టులు కూడా వచ్చాయ్. ఇందుకు.. కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. 2019లో ఇండియాలో నాన్-ఆల్కహాలిక్ మార్కెట్ విలువ 67 వేల 100 కోట్లుగా ఉంది. ఇది.. 20230 నాటికి.. లక్షా 47 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో మేజర్‌ షేర్‌ కోకాకోలా.. పెప్సీ కంపెనీలదే. చాలా ఇండియన్ కంపెనీలు మార్కెట్‌లో ఉన్నా.. కోకాకోలా, పెప్సీలకు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. మార్కెటింగ్‌కోసం వాటిలా వందల కోట్లను ఖర్చు పెట్టలేకపోతున్నాయి. ఇప్పుడు కంపాకోలాను రిలయన్స్ కొనడంతో.. మార్కెటింగ్‌కు భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది.. మార్కెట్ షేర్‌ను పెంచుకోవడానికి రకరకాల ప్లాన్లనూ వర్కవుట్ చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే జనంలోకి ప్రొడక్ట్‌ను తీసుకెళ్లడానికి.. జియోకు వాడిన ప్లాన్‌ను వాడినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకంటే ఒక్కసారి మార్కెట్ చిక్కితే.. ఆ తర్వాత లాభాలే లాభాలు..

దేశంలో.. ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించేందుకు ముడి పదార్థాలు, కార్మికులు, విధానపరమైన మద్దతును అందించడం ద్వారా.. భారత్ బేవరేజెస్ హబ్‌గా మారే అవకాశం ఉందంటున్నారు. బాటిల్ వాటర్, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ లాంటివి.. నాన్ ఆల్కహాలిక్ బేవెరెజెస్ సెక్టార్‌లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే.. జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్, టీ, కాఫీ, పాల ఆధారిత డ్రింక్స్, ఆర్గానిక్ పానీయాలతో.. రోజురోజుకు మార్కెట్ విస్తరిస్తోంది. మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే.. ఇండియాలో సాఫ్ట్ డ్రింక్స్ వినియోగం, ఎగుమతులు తక్కువగా ఉన్నాయి. అందువల్ల.. ఈ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయ్. డొమెస్టిక్ సేల్స్ పెంచడంతో పాటు ఎగుమతులు పెంచుకునేందుకు కూడా స్కోప్ ఉంది. అంతేకాదు.. భారత ఆర్థిక వ్యవస్థకు.. నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ రంగం.. బూస్ట్ ఇవ్వడంతో పాటు దాదాపు 7 లక్షల కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని అంచనాలున్నాయి.

ఈ బేవరేజెస్ ఇండస్ట్రీలో స్టార్టప్‌లతో సహా.. అనేక గ్లోబల్ కంపెనీలు, దేశీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ప్రభుత్వం.. పన్నులు తగ్గిస్తే.. ఈ రంగం మరింత వృద్ధి చెందే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా.. అంబానీ ఇదే పాయింట్ పట్టుకున్నారు. ఇండియాలో.. నాన్-ఆల్కహాలిక్ బేవరేజెస్‌ మార్కెట్‌లో ఎదగటానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే.. రిలయన్స్ సూపర్ మార్కెట్‌లలో.. కోకాకోలా, పెప్సీ బ్రాండ్లకు సంబంధించిన సాఫ్ట్ డ్రింక్స్‌ని అమ్ముతున్నారు. ఇప్పుడు.. వాటి పక్కనే.. సొంత బ్రాండ్ డ్రింక్.. కాంపా కోలాను పెట్టి అమ్మాలని చూస్తున్నారు.

షెల్ఫ్ స్పేస్ స్ట్రాటజీతో.. కోకాకోలా, పెప్సీకి.. స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు సిద్ధమైపోయారు అంబానీ. రిలయన్స్ సూపర్ మార్కెట్‌లలో.. కోకా కోలా, పెప్సీకి చెందిన కూల్ డ్రింక్స్ పక్కనే.. కాంపా కోలాపై బంపర్ ఆఫర్లు పెట్టి అమ్మేసే అవకాశముంది. ఒక కోక్‌కు చెల్లించే ధరలో.. రెండు కాంపా కోలా బాటిల్స్ దొరుకుతుంటే.. కస్టమర్లు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతారు. అయితే.. రిలయన్స్ చేయాల్సిందల్లా ఒక్కటే. కాంపా కోలా ఒరిజినల్ టేస్ట్‌ని చెడగొట్టకుండా.. క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా.. తయారుచేస్తే చాలు. ఇండియన్ మార్కెట్‌లో కోకాకోలా, పెప్సీకి.. కాంపా కోలా గట్టి పోటీ ఇస్తుందని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.