Campa Cola: క్యాంపా‌కోలా మళ్లీ వచ్చేస్తోంది..! దీపావళి నుంచి మార్కెట్‌లోకి..? ఈసారి మూడు రుచుల్లో..

క్యాంపాకోలా శీతల పానీయం గుర్తుందా? ఒకప్పుడు కోలా వేరియంట్ క్యాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది. ఐకానిక్ కోలా 1990 నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. అయితే మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు క్యాంపా కోలా సిద్ధమవుతోంది.

Campa Cola: క్యాంపా‌కోలా మళ్లీ వచ్చేస్తోంది..! దీపావళి నుంచి మార్కెట్‌లోకి..? ఈసారి మూడు రుచుల్లో..

Campa cola

Campa Cola: క్యాంపాకోలా శీతల పానీయం గుర్తుందా? ఒకప్పుడు కోలా వేరియంట్ క్యాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది. ఐకానిక్ కోలా 1990 నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. అయితే మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు క్యాంపాకోలా సిద్ధమవుతోంది. ఎఫ్ఎంసీజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకప్పటి పాపులర్ కూల్ డింక్ర్ క్యాంపా కోలాను మళ్లీ మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. దీపావళి నాటికి దేశ వ్యాప్తంగా మూడు రుచుల్లో క్యాంపా కోలా అందుబాటులోకి రానుంది. వీటిలో ఐకానిక్ ఒరిజినల్, లెమన్, ఆరెంజ్ వేరియంట్ లలో పున: ప్రారంభించాలని రిలయన్స్ సంస్థ యోచిస్తున్నట్లు తెలిసింది.

T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. మిచెల్ స్వెప్సన్ ఔట్.. టీమ్ డేవిడ్ ఇన్..

ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 22 కోట్లకు క్యాంపా, సోస్యో అనే సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ లను రిలయన్స్ కొనుగోలు చేసిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్త ప్రముఖ దిగ్గజాలైన కోకాకోలా, పెప్సీకో లాంటి కంపెనీలకు షాకిచ్చే విషయమనే చెప్పాలి. ఢిల్లీలోని శంకర్ మార్కెట్ సమీపంలోని భవనంలో క్యాంపా కోలా ప్రధాన కార్యాలయం ఉంది. క్యాంపా కోలా ఒక ఢిల్లీ బ్రాండ్. 1999లో ఈ ప్రదేశంలో డ్రింక్ ఉత్పత్తి ఆగిపోయింది. అయితే క్యాంపాకోలాను రిలయన్స్ ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ కొనుగోలు చేయడంతో ప్రస్తుతం మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ 1970 చివరిలో క్యాంపా కోలాను ప్రారంభించింది. 1977లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్య నిబంధనల చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కోకాకోలాను దేశం విడిచి వెళ్లమని కోరింది. 1977 తర్వాత సుమారు 15 సంవత్సరాల పాటు క్యాంపాకోలా ఢిల్లీ యొక్క శీతల పానీయంగా ప్రసిద్ధి చెందింది. విక్రయాల్లో బ్రాండ్ వేగంగా పుంజుకుంది.

Face Recognition App: ఏపీలో నేటి నుంచి ముఖ ఆధారిత హాజరు.. ఎట్టి పరిస్థితుల్లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోమంటున్న ఉపాధ్యాయులు

క్యాంపాకోలా విక్రయాలు జోరుగా సాగుతున్న సమయంలో ఢిల్లీలోని నాలుగు సహా దేశవ్యాప్తంగా 50కి పైగా ఫ్యాక్టరీలలో తయారీ జరిగింది. కానీ పెప్సీ రాక, 1993లో కోకాకోలా తిరిగి వచ్చిన తర్వాత అమ్మకాలు క్షీణిస్తూ వచ్చాయి. 1999 సంవత్సరంలో క్యాంపా కోలా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా క్యాంపా కోలా మళ్లీ మార్కెట్ లోకి రానుంది. రియలన్స్ సంస్థ ఈ సారి మూడు రుచుల్లో క్యాంపా కోలాను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.