T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. మిచెల్ స్వెప్సన్ ఔట్.. టీమ్ డేవిడ్ ఇన్..

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల జట్టును గురువారం ప్రకటించింది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్ లు భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆడనున్నాయి. ఈ సిరీస్ కు సంబంధించిన జట్టునూ ఆస్ట్రేలియా సెలక్టర్లు ప్రకటించారు.

T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. మిచెల్ స్వెప్సన్ ఔట్.. టీమ్ డేవిడ్ ఇన్..

Australia

T20 World Cup 2022: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల జట్టును గురువారం ప్రకటించింది. 2021 లో దుబాయ్‌లో జరిగిన చివరి టోర్నమెంట్‌లో ఫైనల్‌లో న్యూజీలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది చివరల్లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా ఆతిధ్యమిస్తుండటంతో ఈసారికూడా విన్నర్ గా నిలిచేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్న పూర్తి జట్లు ఇవే

ఇదిలాఉంటే ఆస్ట్రేలియా జట్టుకు ఈసారికూడా ఆరోన్ ఫించ్ నాయకత్వం వహిస్తుండగా.. టీమ్ డెవిడ్ ఆస్ట్రేలియా జట్టులో టీ20 ప్రపంచ కప్‌కు తొలిసారి చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు గొప్ప మ్యాచ్ ఫినిషర్. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన టీమ్ డేవిడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు మిచెల్ స్వెప్సన్ కు టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రంపచ కప్ టోర్నీ జరగనుంది.  ఇదిలాఉంటే టీ20 ప్రపంచ కప్ కంటే ఆస్ట్రేలియా జట్టు మూడు టీ20ల సిరీస్ నిమిత్తం భారత్ లో పర్యటించనుంది. సెప్టెంబర్ 20న మొహాలి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సీరీస్ ప్రారంభం కానుంది. భారత్ పర్యటనకు కూడా టీ20 జట్టును ఆస్ట్రేలియా సెలక్టర్లు ప్రకటించారు.

T20 World Cup 2022 : ఐసీసీ ప్రోమో చూశారా? రిషబ్ పంత్ గ్రాండ్ వెల్‌కమ్ అదిరింది.. వీడియో!

టీ20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్‌ కెప్టెన్‌), టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మూథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్.

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్‌ జట్టు:  ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్‌ కెప్టెన్‌), టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మూథ్యూ వేడ్ , కామెరాన్ గ్రీన్‌