10 Tricks: ఇంటి సరుకులకే జీతం మొత్తం పోతుందా? అయితే సూపర్ మార్కెట్‭కు వెళ్లినప్పుడు ఈ 10 ట్రిక్స్ పాటించండి

10 Tricks: ఇంటి సరుకులకే జీతం మొత్తం పోతుందా? అయితే సూపర్ మార్కెట్‭కు వెళ్లినప్పుడు ఈ 10 ట్రిక్స్ పాటించండి

10 Tricks to Avoid Leaving All Your Salary at the Grocery Store

10 Tricks: నెల ప్రారంభంలో జీతం పడగానే అనేక కమిట్‭మెంట్లు ఉంటాయి. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు నుంచి అనేక ఇతర నెలవారి చెల్లింపులు ఉంటాయి. వీటిన్నిటికీ పేమెంట్స్ చేసే లోపు అలా వచ్చిన సాలరీ మొత్తం ఇలా వెళ్లిపోతుంది. ఇలాంటి ఖర్చుల్లో అతి ముఖ్యమైనది ఇంటి సరుకులకు చేసే ఖర్చు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి అయిన తిండి విషయంలో కొంత ఆరోగ్యం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం.. కొంత డబ్బు ఖర్చైనా పరవాలేదని నాణ్యమైన వస్తువుల్నే కొనడానికి ప్రయత్నిస్తాం. అయితే సరిగా చూసుకోకపోవడం వల్ల సరుకు కొంత తక్కువగానో నాణ్యత లేకుండానో వస్తుంటాయి. అలాంటి తొందరగా పాడవడం, లేదంటే రుచి సరిగా ఉండకపోవడం లాంటివి జరుగుతుంటాయి. నాణ్యమైన వస్తువులే ఎక్కువ కాలం నిల్వ ఉండేలా, తక్కువ డబ్బుతో ఎక్కువ వచ్చేలా ప్లాన్ చేసుకుని వీలైనంతలో ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవడానికి ఒక 10 ఉపాయాలు ఉన్నాయి.

1. ముందుగా కనిపించినవి కాకుండా.. చివరలో ఉన్నవి తీసుకోవాలి.


2. షాపు తెరిచే సమయంలోనైనా, మూసే సమయంలోనైనా తీసుకోవడం ఉత్తమం.


3. బాస్కెట్ ఉపయోగించే కంటే కార్ట్ ఉపయోగించండి.


4. బయట పెట్టిన సరుకుల కంటే ఫ్రిజ్‭లో పెట్టినవి తీసుకోండి.


5. ప్యాకేజీ మీద ఉండే ప్రకటనలో ఉన్న దాన్ని కాకుండా వెనకాల ఉండే వివరాలను చదివి తీసుకోండి.


6. ఎదురుగా కనిపించినవి కాకుండా.. షాప్ మొత్తం తిరిగి ఉత్తమమైంది ఎంచుకోండి.


7. కార్డులతో కాకుండా క్యాష్ పేమెంట్స్ చేయండి. ఇలా అయితే కొనుగోళ్లు కొంత అదుపులో ఉంటాయి.


8. కట్ చేసిన ఉన్న వాటిని తీసుకోకపోవడమే మంచిది.


9. ఎదురుగానే కాకుండా కాస్త కింద కూడా చూడండి. అక్కడ మరికాస్త ఉత్తమమైంది ఉండొచ్చు.


10. ఐస్‭లో పెట్టిన మాంసాన్ని కాకుండా కట్ చేసి ఖాళీ కవర్‭లో ప్యాక్ చేసిన మాంసాన్ని తీసుకోండి.