Savings in coins: రూ.50,000 కాయిన్స్ తీసుకువచ్చి బైక్ కొనుక్కున్న వ్యక్తి

 ఓ వ్యక్తి బైక్ కొనుగోలు చేయడానికి ద్విచక్ర వాహనాలు అమ్మే షోరూంకు వెళ్లాడు. అయితే, బైకు కొనుగోలు చేసేందుకుగాను అతడు అన్నీ రూ.1, రూ.2, రూ.5, రూ.10 కాయిన్స్ తీసుకురావడం చూసి షోరూం సిబ్బంది షాక్ అయ్యారు. రూ.50,000 కాయిన్స్ తీసుకువచ్చి, చివరకు ఆ బైక్ కొనుక్కుని వెళ్లిపోయాడు. ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ జిల్లా, రామకృష్ణ నగర్ లో చోటుచేసుకుంది.

Savings in coins: రూ.50,000 కాయిన్స్ తీసుకువచ్చి బైక్ కొనుక్కున్న వ్యక్తి

Savings in coins: ఓ వ్యక్తి బైక్ కొనుగోలు చేయడానికి ద్విచక్ర వాహనాలు అమ్మే షోరూంకు వెళ్లాడు. అయితే, బైకు కొనుగోలు చేసేందుకుగాను అతడు అన్నీ రూ.1, రూ.2, రూ.5, రూ.10 కాయిన్స్ తీసుకురావడం చూసి షోరూం సిబ్బంది షాక్ అయ్యారు. రూ.50,000 కాయిన్స్ తీసుకువచ్చి, చివరకు ఆ బైక్ కొనుక్కుని వెళ్లిపోయాడు. ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ జిల్లా, రామకృష్ణ నగర్ లో చోటుచేసుకుంది.

సురంజన్ రాయ్ అనే వ్యక్తి చిరు వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఓ బైక్ కొనాలని చాలా కాలంగా కలలు కంటున్నాడు. రూపాయీ రూపాయీ కూడబెట్టాడు. అన్నీ కాయిన్స్ రూపంలోనే అతడు జమ చేసుకున్నాడు. మొత్తం రూ.50,000 కాగానే అతడు తమ ప్రాంతానికి సమీపంలోని అభి టీవీఎస్ షోరూంకి వెళ్లాడు.

షోరూం సిబ్బందితో మాట్లాడి తన వద్ద రూ.50,000 కాయిన్స్ ఉన్నాయని, బైక్ కొనుగోలు చేయడానికి కావాల్సిన మిగతా డబ్బును నెలవారీగా చెల్లిస్తానని తెలిపాడు. దీంతో షోరూం సిబ్బంది ఒప్పుకున్నారు. అతడు అపాచీ 160 4వీ బైకు కొన్నాడని షోరూం సిబ్బంది చెప్పారు. బైకు కొనడానికి కొన్నేళ్లుగా చిల్లర కూడబెడుతున్నాడని సురంజన్ రాయ్ చెప్పాడని అన్నారు. బైక్ కొనుక్కున్న సురంజన్ ఆనందానికి అవధులులేవు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..