Diamond Ganesh : సహజ సిద్ధంగా ఏర్పడిన వజ్ర గణపతి .. ఏడాదికి ఒకసారే దర్శనం

ఏ రూపంలో అయినా ఇట్టే ఇమిడిపోయే రూపం గణపయ్య. సహజసిద్దంగా వజ్రంలో ఒదిగిపోయి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఏడాదికి ఒకసారే వినాయక చవితి పండుగకు దర్శనమిచ్చే వజ్ర గణపతి ఓ భక్తుడు కలలో కనిపించి చెప్పిన కథ ఆసక్తికరం..

Diamond Ganesh : సహజ సిద్ధంగా ఏర్పడిన వజ్ర గణపతి .. ఏడాదికి ఒకసారే దర్శనం

Diamond Ganesh

Diamond Ganesh In surat : ఏ రూపంలో అయినా ఇట్టే ఇమిడిపోయే రూపం గణపయ్య. లంబోధరుడు, ఏకదంతుడు, గణనాధుడు ఇలా ఏపేరుతో పిలిచినా ఏ రూపంలో రూపొందించినా భక్తుల కోరికలు తీర్చే గణపయ్యను భక్తులు ఎంతో ఇష్టంగా కొలుచుకుంటారు. ఏ పూజ అయినా తొలిపూజ మాత్రం గణపయ్యదే. అటువంటి గణపయ్య మట్టితో కొలువైనా..కరెన్సీలో కొలువైనా..పండ్లు, కూరగాయలు, రుద్రాక్షలు ఇలా వేటితో తయారు చేసినా గణపయ్య మాత్రం భక్తుల పాలిట ఆపద్భాంధవుడిగానే ఉంటాడు.

ప్రత్యేక ఆకర్షణగా వజ్ర గణపతి
అటువంటి గణపయ్య వజ్రంలో కొలువైతే ఎంత గొప్పగా ఉంటాడో కదా.. అటువంటి వజ్ర గణపతి సూరత్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు ఎన్నో ఏళ్ల నుంచి. వజ్రం ధగధగలతో మెరిసిపోయే వజ్ర గణేశుడు (Diamond Ganesh) మాత్రం ఏడాకి ఒకసారే దర్శనమిస్తాడు. గుజరాత్‌లోని సూరత్‌ అంటూ వజ్రాల వ్యాపారాలకు ప్రసిద్ది అనే విషయం తెలిసిందే. ఇక్కడ వ్యాపారులు వజ్రాలతో ఎన్నో రకాల విభిన్నమైన ఆభరణాలు తయారు చేస్తుంటారు. అటువంటి ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో ఉన్నాడు ఈ వజ్ర గణపతి. ప్రతీ ఏటా ఆ వజ్రాల వ్యాపారి వినాయక చవితి పండుగ సంద్భంగా వజ్రాల గణపతిని పూజిస్తుంటారు.

Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు బంగారు మోదకాలు .. ధర ఎంతో తెలుసా..?!

ఏడాకి ఒకసారే దర్శనమిచ్చే వజ్ర గణపయ్య..
సూరత్ లో వజ్రాల వ్యాపారి కనుభాయ్‌ అసోదరియా (Kanubhai Asodaria)సహస సిద్ధంగా గణపతి రూపంలో ఏర్పడిన గణపతికి ప్రతీ ఏటా వజ్ర చేసిన గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు. ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు. దీంతో వజ్రాల గణపతిని దర్శించుకోవటానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఈ వజ్రాల గణపతి బొమ్మ సైజు కోహినూర్‌ వజ్రం కంటే పెద్దదిగా ఉంటుంది.

వజ్ర గణపయ్యకు ప్రతీ ఏటా పూజలు..
ఈ వజ్రం ధర గురించి కనుభాయ్‌ ఏమాత్రం చెప్పరు. ఎందుకంటే అది కేవలం వజ్రం మాత్రమే కాదు వజ్రంలో గణపతి కూడా ఉండటంతో ఆ వజ్రం ధర చెప్పరు ఆయన. గణపయ్యకు ధరను నిర్ణయించే వారమా…? అనేది ఆయన భావన. అందుకే ఆ వజ్రం ధర గురించి చెప్పరు. కానీ ఆయన ధర గురించి చెప్పకపోయినా వజ్రాల వ్యాపారులు మాత్రం ఆ వజ్రం ధరను అంచనా వేశారు.మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంటుంటారు.

సహజ సిద్ధంగా వజ్రం రూపంలో ఏర్పడిన గణపయ్య..
15 ఏళ్ల క్రితం వ్యాపారం కోసం కనుభాయ్ బెల్జియం వెళ్లి అక్కడి నుంచి కొన్ని ముడి వజ్రాలకు తీసుకొచ్చారట. ఆ వజ్రాల్లో ఓ వజ్రంలో గణపతి ఆకారంలో ఉన్నట్లు కనుభాయ్ తండ్రికి కల వచ్చిందట. మరునాడు ఆ వజ్రాలను నిశితంగా పరిశీలించారు. అలా పరిశీలించిన ఆయన ఆశ్చర్యపోయారట. ఆ వజ్రాల్లో ఓ వజ్రం విభిన్నంగా కనిపించటం..ఆ వజ్రం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి ఆకారంలో ఉంటం చూసి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. అలా అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి వారి కుటుంబం పూజలు చేస్తోంది. అలా ఆ వజ్ర గణపతిని ఏడాకి ఒకసారి బయటకు తెస్తారు కనుభాయ్‌.

Ganesh Chaturthi 2023 : రూ.2.5 కోట్లు విలువైన నాణాలతో వినాయకుడికి అలంకరణ